For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 నెల‌ల్లో 74,650 కంపెనీల న‌మోదు

కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ లెక్క‌ల ప్ర‌కారం భార‌త్లో కంపెనీల న‌మోదులో పురోగ‌తి ఆశావ‌హంగా ఉంది. జ‌న‌వ‌రి నుంచి ఆగ‌స్టు మ‌ధ్య 8 నెల‌ల కాలంలో దాదాపు 74,650 కొత్త కంపెనీలు రిజిస్ట‌ర్ అయ్యాయి.

|

కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ లెక్క‌ల ప్ర‌కారం భార‌త్లో కంపెనీల న‌మోదులో పురోగ‌తి ఆశావ‌హంగా ఉంది. జ‌న‌వ‌రి నుంచి ఆగ‌స్టు మ‌ధ్య 8 నెల‌ల కాలంలో దాదాపు 74,650 కొత్త కంపెనీలు రిజిస్ట‌ర్ అయ్యాయి. ఇందులో కేవ‌లం ఆగ‌స్ట్ నెల‌లోనే 9413 కంపెనీలు న‌మోద‌య్యాయి. ఆగ‌స్ట్ 2015 నుంచి ఆగ‌స్టు 2017 మ‌ధ్య కంపెనీల న‌మోదుపై జ‌రిగిన విశ్లేష‌ణ ఈ విధంగా ఉంది. ఆగ‌స్టు 2016లో క‌నిష్టంగా 3994 కంపెనీలు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. అయితే డిసెంబ‌రు 2016 త‌ర్వాత నుంచి బాగా పెరిగిన కొత్త కంపెనీల న‌మోదు ఎంత మాత్రం త‌గ్గ‌కుండా 2017లో దాదాపు అన్ని నెల‌ల్లో మంచి పురోగ‌తి క‌న‌బ‌డింది.

 కంపెనీల న‌మోదు

2017 ఆగ‌స్టు చివ‌రి నాటికి దేశ‌వ్యాప్తంగా న‌మోద‌యిన మొత్తం కంపెనీల సంఖ్య 16,87,745గా ఉంది. ఇందులో 5,16,565 కంపెనీలు మూసుకుపోయాయి. 1084 కంపెనీలు ఏ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌కుండా కంపెనీల చ‌ట్టం, 2013 కింద ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 కంపెనీలు గ‌త రెండేళ్లుగా త‌మ వార్షిక ఫైలింగ్‌ల‌ను స‌మ‌ర్పించ‌డ‌ లేదు. 114 కంపెనీలు పున‌రుద్ద‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.
రాష్ట్రాల వారీగా గ‌మ‌నిస్తే మ‌హ‌రాష్ట్ర నుంచి అత్య‌ధికంగా 3,36,505 కంపెనీలు ఉండ‌గా దాని త‌ర్వాతి స్థానంలో ఢిల్లీ(3,09,545), ప‌శ్చిమ బెంగాల్(1,94,398) ఉన్నాయి.
ఆగ‌స్టు నెల‌లో న‌మోద‌యిన వాటిలో ప‌ని చేసే రంగం ప‌రంగా చూస్తే వ్యాపార సేవ‌ల కింద 5015 కంపెనీలు(54%), త‌యారీ రంగంలో(1012), ట్రేడింగ్‌లో(783), క‌మ్యూనిటీ,వ్య‌క్తిగ‌త‌, సామాజిక సేవ‌ల కింద‌(783), నిర్మాణ రంగంలో 549 కంపెనీలు ఉన్నాయి.

Read more about: mca companies
English summary

8 నెల‌ల్లో 74,650 కంపెనీల న‌మోదు | There is a optimism in the companies registered in India in 2017

According to the monthly information bulletin on corporate sector published by the ministry of corporate affairs (MCA), around 74,650 new companies were registered during the January-August 2017 period
Story first published: Wednesday, September 27, 2017, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X