దక్షిణాసియాలో పోటీనిచ్చే దేశంగా భారత్
దక్షిణాసియా ప్రాంతంలో పెట్టుబడులకు ఎక్కువ పోటీనిచ్చే దేశాల్లో భారత్ ముఖ్య స్థానంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా 137 దేశాల్లో 40 వ స్థానం సాధించిన ఇండియా దక్షిణాసియాలో మాత్రం మొదటిస్థానంలో నిలిచ
దక్షిణాసియా ప్రాంతంలో పెట్టుబడులకు ఎక్కువ పోటీనిచ్చే దేశాల్లో భారత్ ముఖ్య స్థానంగా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా 137 దేశాల్లో 40 వ స్థానం సాధించిన ఇండియా దక్షిణాసియాలో మాత్రం మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక వేదిక పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 137 దేశాలకు ర్యాకింగ్‌లను ఇచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ర్యాంకింగ్‌ల ప్రకారం స్విట్జర్లాండ్ 1, యూఎస్ 2, సింగపూర్ 3 వ స్థానాల్లో నిలిచాయి. డబ్ల్యూఈఎఫ్ నివేదిక ప్రకారం పోటీతత్వంలో భారత స్థితి మెరుగుపడింది. ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న దేశాల్లో 2000 సంవత్సర కాలంలో బ్రెజిల్, టర్కీ ఉన్న స్థితి నుంచి 2013 వచ్చే సరికి దిగజారాయి. మరో వైపు చైనా, భారత్, ఇండోనేషియా పోటీతత్వంలో మెరుగుపడ్డాయి.

ఈ పోటీతత్వంలో ర్యాంకింగ్‌లు ఇచ్చేందుకు వివిధ సంస్థలు, మౌలిక వసతులు, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, విద్య, ప్రాథమిక విద్య, సాంకేతికత, మార్కెట్ పరిమాణం, సృజనాత్మకత, కార్మిక మార్కెట్ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 1 నుంచి 7 స్కేల్ మీద ఆయా అంశౄలకు మార్కులిచ్చారు. మార్కెట్ సైజ్ విషయంలో భారత్ మూడో ర్యాంకింగ్‌లో ఉంటూ 6.4 స్కోర్‌ను సాధించింది.సంస్థలు, మౌలిక రంగం, సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, ఉన్నత విద్య, శిక్షణ, వ్యాపార అనుకూలత, సృజనాత్మకత వంటి అంశాల్లో 4 పైన స్కోర్ వచ్చింది. ఆరోగ్యం(వైద్యం), ప్రాథమిక విద్య విషయంలో 5.5 స్కోర్ వచ్చింది.


Click it and Unblock the Notifications