ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో వివరాలు అప్‌డేట్ చేయాలి: ఐటీ శాఖ
పన్ను చెల్లింపుదారులంతా తమ ప్రొఫైల్‌ను, ముఖ్యమైన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయాల్సిందిగా సూచించింది.
ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో వివరాలు అప్‌డేట్ చేయాలి: ఐటీ శాఖ
ఐటీ శాఖ తమ నుంచి ప్రజలకు అందే సమాచారం లోపాల్లేకుండా చేరేందుకు ఒక ప్రధాన మార్పును సూచించింది. ఎవరైతే ఐటీ రిటర్నులను సమర్పిస్తారో, ఇన్ కమ్ ట్యాక్స్ బిజినెస్ వ్యవహారాలు ఆన్‌లైన్లో చేపడతారో అలాంటి పన్ను చెల్లింపుదారులంతా తమ ప్రొఫైల్‌ను, ముఖ్యమైన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయాల్సిందిగా సూచించింది. ఐటీ శాఖ, పౌరుల మధ్య సమాచార మార్పిడి సమర్థంగా జరిగేందుకు ఇది ఉపయోగపడుతుందని సూచించింది.

తాజా సమాచారం, ప్రాథమిక,ద్వితీయ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు వంటి వాటిని ఎప్పటికప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా ఈ-ఫైలింగ్ పోర్టల్ నందు అప్డేట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ పౌరులను అప్రమత్తం చేసింది. తమ తమ మెయిల్ ఐడీలకు, ఫోన్లకు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన తర్వాతనే ఈ వివరాలు అప్‌డేట్ అవుతాయి.
"ఇప్పటికే ఈ-ఫైలింగ్ చేసేవారు తమ ప్రొఫైల్‌ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ నందు మార్చుకోవాలి. ఇదివరకే నమోదు చేసుకుని లాగిన్ యాక్టివేట్ చేసుకోని వారు మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారంతా వారికి ఐటీ శాఖ సందేశాలు సక్రమంగా చేరే విధంగా మెయిల్ ఐడీలు, కాంటాక్ట్ నంబరు ఇవ్వాల"ని ఐటీ శాఖ సూచనలో వెల్లడించింది.
పన్ను చెల్లింపుదార్లు https://incometaxindiaefiling.gov.in/ ఇక్కడ తమ వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications