For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాండ్ల జారీకి స్థిరాస్తి, మౌలిక ట్ర‌స్టుల‌కు సెబీ అనుమ‌తి

డెట్ సెక్యూరిటీల‌ను జ‌రాఈ చేయ‌డం ద్వారా మూల‌ధ‌నం స‌మ‌కూర్చుకునేందుకు మౌలిక రంగం పెట్టుబ‌డి సంస్థ‌ల‌కు(ఇన్విట్స్‌-InvIT), స్థిరాస్తి రంగంలోని ట్ర‌స్టుల‌కు(REIT) అనుమ‌తి ఇస్తున్న‌ట్లు సెబీ సోమ‌వారం ప్ర‌

|

డెట్ సెక్యూరిటీల‌ను జ‌రాఈ చేయ‌డం ద్వారా మూల‌ధ‌నం స‌మ‌కూర్చుకునేందుకు మౌలిక రంగం పెట్టుబ‌డి సంస్థ‌ల‌కు(ఇన్విట్స్‌-InvIT), స్థిరాస్తి రంగంలోని ట్ర‌స్టుల‌కు(REIT) అనుమ‌తి ఇస్తున్న‌ట్లు సెబీ సోమ‌వారం ప్ర‌క‌టించింది. దీంతో నిధుల కొర‌త‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స్థిరాస్తి రంగానికి కాస్త సాంత్వ‌న ల‌భించ‌నుంది. అంతే కాకుండా వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల‌కు సైతం స్థిరాస్తి రంగ ట్ర‌స్టుల్లో సెబీ అవ‌కాశం ఇచ్చింది.

 సెబీ కొత్త నిర్ణ‌యం-స్థిరాస్తి రంగానికి లాభించేదే

సెబీ సొమ‌వారం బోర్డు స‌మావేశం త‌ర్వాత పై అనుమ‌తుల‌తో పాటు మ‌రొక ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. REIT-రియ‌ల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్ర‌స్టులు క‌నీసం 50% ఈక్విటీ వాటా లేదా వ‌డ్డీని హోల్డింగ్ కంపెనీలో లేదా స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్ రూపంలో పెట్టుబ‌డి పెట్టాల‌నే దానికి సంబంధించి భ‌విష్య‌త్తులో చ‌ర్చాప‌త్రం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. అంతే కాకుండా హోల్డింగ్ కంపెనీలు త‌మ ఈక్విటీ నిధుల్లో లేదా వ‌డ్డీలో వ‌చ్చే సొమ్ములో క‌నీసం 50 శాతాన్ని స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్(ప్ర‌త్యేక ప్రాయోజిత ప‌థ‌కం)లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి సంబంధించి సైతం సంప్ర‌దింపులు జ‌రుగుతాయ‌ని సెబీ తెలిపింది. (ఇన్విట్స్‌-InvIT), స్థిరాస్తి రంగంలోని ట్ర‌స్టుల‌(REIT) ద్వారా పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డుల‌ను ఆదాయాన్నిచ్చే మౌలిక రంగ ప్రాజెక్టులు లేదా స్థిరాస్తి కంపెనీల్లో ఉంచేందుకు సంబంధించి చాలా రోజుల నుంచి చర్చ‌లు జరుగుతున్నాయి.

Read more about: relaty infrastructure real estate
English summary

బాండ్ల జారీకి స్థిరాస్తి, మౌలిక ట్ర‌స్టుల‌కు సెబీ అనుమ‌తి | sebi allows InvITs and REITs to raise funds from debt securities

The Securities and Exchange Board of India (SEBI) on Monday allowed Infrastructure Investment Trusts (InvITs) and Real Estate investment Trusts (REITs) to raise capital by issuing debt securities.
Story first published: Tuesday, September 19, 2017, 12:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X