జీఎస్టీ తుది గడువును మరిన్ని రోజులు పెంచబోం
పన్ను చెల్లింపుదారులు ముందుగానే రిటర్నులు దాఖలుచేయాలని, అంతే కానీ చివరి రోజు వరకూ వేచి ఉండకూడదని సూచించింది.
డిసెంబరు తర్వాత మరిన్ని రోజులు జీఎస్టీ రిటర్నుల గడువును పెంచేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.పన్ను చెల్లింపుదారులు ముందుగానే రిటర్నులు దాఖలుచేయాలని, అంతే కానీ చివరి రోజు వరకూ వేచి ఉండకూడదని సూచించింది. "జీఎస్టీ ఫైలింగ్ కోసం దీర్ఘకాలం డెడ్‌లైన్లను పొడిగిస్తూ వచ్చాం. పన్ను చెల్లింపుదారులు కనీసం 6 నెలలు వాళ్ల రిటర్నులను దాఖలు చేసేందుకు గడువుంది. కాబట్టి ఇకపై దాన్ని పొడిగించబోం" అని రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు.

వ్యాపారులు జీఎస్టీఆర్-3బీని స్వయంగా అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వానికి రిటర్నులు సమర్పించేందుకు డిసెంబరు వరకూ జీఎస్టీ కౌన్సిల్ గడువిచ్చింది. జీఎస్టీ రిటర్నుల సమర్పణలో ఉన్న సమస్యలను తీర్చేందుకు ఒక ప్రణాళికను ప్రభుత్వం వేసుకుంది. జీఎస్టీకి సంబంధించి అందరి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని హస్ముఖ్ అధియా చెప్పారు.
మంత్రుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 30 నాటికి రిటర్నుల ఫైలింగ్‌లో ఉన్న 70-80 శాతం సాంకేతిక సమస్యలను తీరుస్తారని అన్నారు. "పన్ను చెల్లింపుదారులు చివరి రోజు వరకూ వేచిచూడకూడదు. తుది గడువుకు 4 రోజుల ముందు ఎక్కువ రిటర్నులు చేసేందుకు త్వరపడతారు. అందుకే పన్ను చెల్లింపుదారులు చివరి వరకూ వేచి ఉండకుండా ముందే రిటర్నులు సమర్పించాలి" అని సుశీల్ చెప్పారు.


Click it and Unblock the Notifications