For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐటీ శాఖ తాజా చ‌ర్య‌: డొల్ల కంపెనీల గుర్తింపు

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఎవ‌రికి తోచిన విధంగా వారు త‌మ వ‌ద్ద పెద్ద‌నోట్లు మార్చుకున్నారు. అయితే త‌ర్వాత నెమ్మ‌దిగా వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. డొల్ల కంపెనీల‌పై ప్ర‌భుత్వ దృష్టి మూలంగా ఐటీ శాఖ త

|

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఎవ‌రికి తోచిన విధంగా వారు త‌మ వ‌ద్ద పెద్ద‌నోట్లు మార్చుకున్నారు. అయితే త‌ర్వాత నెమ్మ‌దిగా వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. డొల్ల కంపెనీల‌పై ప్ర‌భుత్వ దృష్టి మూలంగా ఐటీ శాఖ తాజాగా 2138 సంస్థ‌ల‌ను న‌కిలీ వాటిగా గుర్తించింది. ప‌న్ను అధికారులు ఇప్ప‌టి వ‌ర‌కూ గుర్తించిన డిపాజిట్ల విలువ రూ.1321 కోట్లుగా ఉండ‌గా, ఈ సొమ్ము రూ.5 వేల కోట్ల వ‌ర‌కూ పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

డొల్ల కంపెనీల‌పై ఐటీ శాక న‌జ‌ర్‌

ఇప్పుడు తాజాగా వెల్ల‌డైన స‌మాచారం ప్ర‌కారం 3676 డైరెక్ట‌ర్లు, అసోసియేటెడ్ ఎంట్రీ ఆప‌రేట‌ర్లు, నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో వీటిలో డ‌బ్బు జ‌మ చేసిన వారి వివ‌రాల‌ను సేక‌రించారు. ప‌న్ను అధికారుల ప్ర‌కారం, ఈ విష‌యాల‌ను విశ్లేషిస్తే లిస్టెడ్, అన్‌లిస్టెడ్ సంస్థ‌లు, కార్పొరేట్‌తో సంబంధం ఉన్న సంస్థ‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. కార్పొరేట్ సంస్థ‌లు వీటిని ఉప‌యోగించుకుని లెక్క‌ల్లేని ధనాన్ని డిపాజిట్ చేసిన‌ట్లు భావిస్తున్నారు. షెల్ కంపెనీలు నిర్వ‌హించిన బ్యాంకు ఖాతాలు, ఎంత డ‌బ్బును న‌గ‌దు రూపంలో డిపాజిట్ చేశారు, డైరెక్ట‌ర్ల వివ‌రాలు వంటి వాటిని తాజా వెలికితీత‌ బ‌య‌ట‌పెట్టింది.

Read more about: it department income tax
English summary

ఐటీ శాఖ తాజా చ‌ర్య‌: డొల్ల కంపెనీల గుర్తింపు | IT department has identified 2138 firms suspicious

In a fresh clampdown on shell companies, the income tax (I-T) department has identified 2,138 firms that deposited unaccounted cash during the demonetisation period.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X