ఆగస్టు 31లోపు ఆధార్, పాన్ కార్డు అనుసంధానించాల్సిందేనా?
సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతపై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆధార్ చట్టబద్దత, ఆధార్ అనుసంధానంపై పలువురికి అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే స్పందిస్తూ పన్ను
సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతపై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆధార్ చట్టబద్దత, ఆధార్ అనుసంధానంపై పలువురికి అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే స్పందిస్తూ పన్ను చెల్లింపుదార్లు తమ ఆధార్ కార్డును పాన్‌తో అనుసంధానించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికైతే ఎటువంటి అవాంతరాలు లేకుండా వివిధ పథకాలు, ప్రభుత్వం ద్వారా అందుకునే ప్రయోజనాలకు ఆధార్ అవసరాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పారు.

ప్రభుత్వం నల్లధనం అరికట్టేందుకు, పన్ను ఎగవేతలు కాకుండా చూసేందుకు ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానాన్ని ఆగస్టు 31 లోపు పూర్తిచేయాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను చట్టంలో సవరణ మూలంగా పాన్, ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంతో ఈ నిబంధన ఇలాగే కొనసాగుతోందని, సుప్రీంకోర్టు తీర్పు ఈ ప్రక్రియపై ఉండదని పాండే చెప్పారు.

సుప్రీం ఆర్డర్ నేపథ్యంలో తమ వివరాలు ఇవ్వడానికి ఎవరైనా తిరస్కరించారా అని అడిగిన ప్రశ్నకు పాండే ఇప‍్పటివరకూ అలాంటి లేదన్నారు. ఎందుకంటే ఆధార్ చట్టం చెల్లుబాటు అయ్యే చట్టమనీ, సుప్రీం తాజా తీర్పులో ఆధార్ చట్టంపై ఏమీ వ్యాఖ్యానించలేదని చెప్పారు.

ఆధార్ కోసం రూపొందించిన చట్టం ఒక మౌలికమైన హక్కుగా ప్రజల గోప్యతకు రక్షణ కల్పిస్తుందని యూఐడీఏఐ సీఈవో పాండే తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని కాపాడేందుకు, అటువంటి డేటాను ఎలా ఉపయోగించవచ్చో దానికి అవసరమైన నిబంధనలు పొందుపరిచాం కాబట్టి, వ్యక్తి అంగీకారం లేకుండా సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఎవరికి ఇచ్చేది లేదని తెలిపారు.


Click it and Unblock the Notifications