4 నెల‌ల్లో రెండు రెట్లు పెరిగిన దేశ‌ ప‌సిడి దిగుమ‌తులు

ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్-జులై మ‌ధ్య బంగారం దిగుమతులు 13.35 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగిన‌ట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుందాం.

ఏప్రిల్ నుంచి జులై నెల మ‌ధ్య ప‌సిడి దిగుమ‌తులు రెట్టింపు అయ్యాయి. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్-జులై మ‌ధ్య బంగారం దిగుమతులు 13.35 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగిన‌ట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుందాం.

 క‌రెంటు ఖాతాల లోటుపై ప్ర‌భావం

క‌రెంటు ఖాతాల లోటుపై ప్ర‌భావం

మ‌న దేశం చేసుకునే దిగుమ‌తుల్లో పెట్రోలు, బంగారం వంటివి ప్ర‌ధాన‌మైన‌వి. వీటి కోసం మ‌నం విదేశీ క‌రెన్సీ ఎంతో ఖ‌ర్చు చేయాలి. అందుకే దేశ క‌రెంటు ఖాతా లోటుపై వీటి ప్ర‌భావం చూపుతుంది. ఏప్రిల్ నుంచి జులై మ‌ధ్య బంగారం దిగుమ‌తుల కార‌ణంగా క‌రెంటు ఖాతా లోటు 4.97 బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోద‌యింది.

ఈ ఏడాది జులై నెల‌లో

ఈ ఏడాది జులై నెల‌లో

2016 జులై నెల‌లో 1.07 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న బంగారం దిగుమ‌తుల విలువ ఈ సంవ‌త్స‌రం జులై నెల‌లో బాగా పెరిగి 2.10 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి చేరింది. బంగారం దిగుమ‌తుల పెరుగుద‌ల‌కు కార‌ణాల‌ను చూస్తే అమెరికాయే ఒక కార‌ణంగా ఉంది. ఆ దేశంతో ఉన్న వాణిజ్య లోటు జులై 2016లో 7.76 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గా జులై 2017 నాటికి 11.44 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెరిగింది.

ద‌క్షిణ కొరియా నుంచి సైతం బంగారం దిగుమ‌తులా...

ద‌క్షిణ కొరియా నుంచి సైతం బంగారం దిగుమ‌తులా...

ద‌క్షిణ కొరియా ప్ర‌భుత్వంతో భార‌త్ 2010లో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. అప్ప‌టి నుంచి ఆ దేశం నుంచి సైతం బంగారం దిగుమ‌తుల హ‌వా కొనసాగుతోంది. ఇటీవ‌లే బంగారం దిగుమ‌తుల పెరుగుద‌ల కారణంగా డీజీఎఫ్‌టీ బంగారం దిగుమ‌తుల‌పై ప‌లు ఆంక్ష‌ల‌ను విధించింది.

కస్ట‌మ్స్ సుంకం తొల‌గింపుతో పెరిగిన దిగుమ‌తులు

కస్ట‌మ్స్ సుంకం తొల‌గింపుతో పెరిగిన దిగుమ‌తులు

జులై 1 నుంచి ఆగ‌స్టు 1 మ‌ధ్య ద‌క్షిణ కొరియా నుంచి వ‌చ్చిన బంగారం దిగుమ‌తులు 338.6 మిలియ‌న్ డాల‌ర్లుగా నిలిచిన‌ట్లు గ‌ణాంకాలు తెలుపుతున్నాయి. 2016-17లో దిగుమ‌తుల విలువ 470.46 మిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్నాయి. భార‌త్‌, ద‌క్షిణ కొరియా మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం బంగారంపై ప్రాథ‌మిక క‌స్ట‌మ్స్ సుంకాన్ని తొల‌గించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+