For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడాది మొత్తం 30వేల కొత్త ఉద్యోగాలు.. టెక్ కంపెనీల్లో

అమెరికా ప్రాజెక్టుల‌ను చేప‌ట్టే యాక్సెంచ‌ర్, క్యాప్‌జెమినీ, ఓరాకిల్‌, ఐబీఎమ్‌, గోల్డ్‌మాన్ శాచ్స్ వంటివి వంద‌ల నుంచి వేల మందిని నియ‌మించుకునే ప్ర‌ణాళిక‌లో ఉన్నాయి. దాని గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను కి

|

ఆటోమేష‌న్‌, లాభాలు త‌గ్గ‌డంతో దేశ ఐటీ ప‌రిశ్ర‌మ కాస్త క‌ష్టాల్లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించుకునే ప‌నిలో పడ్డాయి. అయితే దీనికి భిన్నంగా మ‌రికొన్ని కంపెనీలు పెద్ద సంఖ్య‌లో ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటున్నాయి. అమెరికా ప్రాజెక్టుల‌ను చేప‌ట్టే యాక్సెంచ‌ర్, క్యాప్‌జెమినీ, ఓరాకిల్‌, ఐబీఎమ్‌, గోల్డ్‌మాన్ శాచ్స్ వంటివి వంద‌ల నుంచి వేల మందిని నియ‌మించుకునే ప్ర‌ణాళిక‌లో ఉన్నాయి. దాని గురించి మ‌రిన్ని వివ‌రాల‌ను కింద తెలుసుకుందాం.

యాక్సెంచ‌ర్

యాక్సెంచ‌ర్

భార‌త‌దేశంలో యాక్సెంచ‌ర్‌కు ప్ర‌స్తుతం 5396 ఉద్యోగ అవ‌కాశాలు ఖాళీగా ఉన్నాయి. ఇది అమెరికాలో ఉన్న‌దాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ‌. అదే పోలాండ్‌, ఫిలిప్పైన్స్‌తో పోలిస్తే 12 సార్లు. ఈ కంపెనీకి ఆయా దేశాల్లో ఎక్కువ‌గా కార్య‌క‌లాపాలు ఉంటాయి.

క్యాప్‌జెమినీ

క్యాప్‌జెమినీ

ఫ్రెంచి ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీకి ప్ర‌స్తుతం మ‌న దేశంలో 2649 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. కంపెనీ వెబ్‌సైట్ ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్త నియామ‌కాల్లో ఈ ఏడాది భార‌త్‌లో ఇచ్చే ఉద్యోగాల సంఖ్య 55%.

ఓరాకిల్‌, అమెజాన్‌

ఓరాకిల్‌, అమెజాన్‌

ఓరాకిల్ కంపెనీకి ప్ర‌స్తుతం ఇండియాలో 1124 ఓపెనింగ్స్ ఉన్నాయి. ప‌లు ప్ర‌ధాన వార్తా ప‌త్రిక‌లు రిపోర్ట్ చేసిన దాని ప్ర‌కారం ఈ-కామర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఈ ఏడాది పెద్ద ఎత్తున భారీ నియ‌మాకాలు చేప‌ట్ట‌బోతున్న‌ది. కంపెనీ వెబ్‌సైట్ అమెజాన్ ఇచ్చిన స‌మ‌చారం ప్ర‌కారం ప్ర‌స్తుతం 1208 ఖాళీల‌ను కొత్త‌వారితో భ‌ర్తీచేస్తారు.

ఇత‌ర కంపెనీలు

ఇత‌ర కంపెనీలు

ఇత‌ర పెద్ద కంపెనీల్లో ఐబీఎమ్‌(675), గోల్డ్‌మాన్ శ్యాచ్స్‌(320), డెల్(285), మైక్రోసాఫ్ట్‌(235), సిస్కో(229), ఫ్రెంచి బ్యాంక్ సొసెటె జెన‌రాలి(185) మంది ఉద్యోగుల‌ను నియ‌మించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే కాలం గ‌డుస్తున్న కొద్దీ ఎంత మందిని నియ‌మించుకోవాల‌నే ప్ర‌ణాళిక మారుతూ ఉంటుంది. ఈ సంఖ్య నిర్దిష్ట‌మైన‌ద‌ని చెప్ప‌లేం. సాధార‌ణంగా ఇంత‌కంటే ఎక్కువ మందిని సైతం తీసుకోవ‌చ్చు.

దేశంలో ఐటీ ప‌రిశ్ర‌మ క‌ల్పించిన ఉద్యోగాల లెక్క‌లు

దేశంలో ఐటీ ప‌రిశ్ర‌మ క‌ల్పించిన ఉద్యోగాల లెక్క‌లు

నాస్కామ్ లెక్క‌ల ప్ర‌కారం దేశీయ ఐటీ పరిశ్ర‌మ‌లో ఉన్న బ‌హుళ జాతి సంస్థ‌లు దాదాపు 10% రెవెన్యూ వృద్దిని క‌న‌బ‌రిచి 7,70,000 ఉద్యోగుల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నాయి. క‌న్స‌ల్టెన్సీ సంస్థ జిన్నోవ్ 1150 బ‌హుళ జాతి సంస్థ‌లు భార‌త్‌లో గ్లోబ‌ల్ ఇన్‌హౌస్ సెంట‌ర్లు ఉన్నాయి. 2016 సంవ‌త్స‌రంలో ఆయా సంస్థ‌లు 8,15,000 ఉద్యోగాల‌ను క‌ల్పించాయి.

ఎక్కువ బెంగుళూరులోనే

ఎక్కువ బెంగుళూరులోనే

నిక‌రంగా ఐటీ బ‌హుళ జాతి కంపెనీల‌న్నీ క‌లిసి 30వేల ఉద్యోగాల‌ను క‌ల్పిస్తున్నాయి. దేశంలో ఉన్న మొత్తం వాటిలో బెంగుళూరులో 35%, దేశ రాజ‌ధాని ప్రాంతం(డిల్లీ)లో 15% బ‌హుళ‌జాతి కంపెనీలున్నాయి. ఒక వైపు దేశీయ ఐటీ దిగ్గ‌జాలు టీసీఎస్‌, సీటీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్ మ‌హీంద్రా వంటివి వారి ఉద్యోగుల సంఖ్య‌ను త‌గ్గించే ప‌నిలో ఉండ‌గా, ఈ విధంగా ప‌లు కంపెనీలు ఉద్యోగుల‌ను నియ‌మించుకునే ప్ర‌ణాళిక‌లు క‌లిగి ఉండ‌టం శుభ‌సూచ‌కం.

Read more about: software technology it
English summary

ఈ ఏడాది మొత్తం 30వేల కొత్త ఉద్యోగాలు.. టెక్ కంపెనీల్లో | Tech MNCs are going to recruit thousands in India

The Indian IT services sector may be passing through some rough weather with challenges of automation and lower growth rates, forcing many to lay off employees and reduce the rate of hiring. But many technology MNCs in the country are continuing to hire in large numbers. Companies such as Accenture, Capgemini, Oracle, IBM, and Goldman Sachs are hiring in hundreds, some in thousands.
Story first published: Thursday, August 17, 2017, 11:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X