ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్-జూలై వ్యవధిలో గతంతో పోలిస్తే 19.1 శాతం పెరిగి 1.90 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.80 లక్షల కోట్ల రూపాయల వసూళ్ల
ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్-జూలై వ్యవధిలో గతంతో పోలిస్తే 19.1 శాతం పెరిగి 1.90 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.80 లక్షల కోట్ల రూపాయల వసూళ్లను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తొలి నాలుగు నెలల్లో 19.5 శాతం లక్ష్యం నెరవేరింది. మొత్తంగా ప్రత్యక్ష పన్ను వసూళ్లలో వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను ఉంటాయి. ఈ రెండింటిలోనూ స్థిర వృద్ది ఉంటుందని ఆర్థిక శాఖ పేర్కొంది. కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ది రేటు 7.2 శాతంగా ఉండగా; వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో నాలుగు నెలల్లో వృద్ది రేటు 17.5% ఉంది. అయితే వీటిలో రీఫండ్లకు సంబంధించిన వివరాల్లేవు. రీఫండ్ల తర్వాత సవరించిన లెక్కలు చూస్తే నికర కార్పొరేట్ వసూళ్ల వృద్ది రేటు 23.2% కాగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లలో వృద్ది రేటు 15.7శాతంగా ఉంది.

కాగా, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూలైలో 1.59 లక్షల కోట్ల రూపాయల వసూళ్లు జరగగా, నాడు వృద్ధిరేటు మాత్రం 24.01 శాతంగా నమోదవడం విశేషం. గత వారమే ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్నుల్లో పురోగతిని గూర్చి విశ్లేషించింది. పెద్ద నోట్ల మార్పిడి/రద్దు తర్వాత చాలా వృద్ది కనబడిందని తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications