లిస్టెడ్ కంపెనీలపై సెబీ కొరడా
మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 331 లిస్టెడ్ కంపెనీల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపియాలని నిర్ణయించింది. ఈ మేరకు బిఎస్‌ఇ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఇ
* వాటిలో షేర్ల ట్రేడింగ్ తక్షణమే నిలపాల్సిందిగా ప్రభుత్వాదేశం
మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 331 లిస్టెడ్ కంపెనీల లావాదేవీలను నెల రోజుల పాటు నిలిపియాలని నిర్ణయించింది. ఈ మేరకు బిఎస్‌ఇ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ, మెట్రపాలిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కంపెనీలను డొల్ల కంపెనీలుగా అనుమానిస్తూ ఒక జాబితాను రూపొందించింది. నెలకు ఒక్క రోజు మాత్రమే ట్రేడింగ్‌కు అవకాశం ఉండే స్టేజ్-4 గ్రేడెడ్ సర్వీలెన్స్ మెజర్ (జిఎస్‌ఎం)లో ఈ కంపెనీలను చేర్చాలని సూచించింది. దీంతో ప్రతి నెలలో తొలి సోమవారం మాత్రమే వీటిని ట్రేడింగ్‌కు అనుమతివ్వనున్నారు. అవసరమైతే ఆయా కంపెనీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కూడా సెబీ ఆదేశించింది. అదే విధంగా మోసపూరిత కంపెనీలకు సహకరిస్తున్న 26 మంది చార్టర్డ్ ఎకౌంటెంట్లపై విచారణ చేపడుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.

నోట్ల రద్దు తర్వాత డొల్ల కంపెనీల పేర్లతో నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను దాచేందుకు మార్చేందుకు, నల్లధనాన్ని తెల్లగా మార్చేందుకు చాలా మార్గాలను అనుసరించారు. అయితే అప్పటి నుంచి పన్ను ఎగవేతదారులపై బాగా దృష్టి సారించారు. మోదీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 37వేల డొల్ల కంపెనీలను గుర్తించారు. ఈ తరహా కంపెనీలన్నీ పన్ను ఎగవేతకు ఉపయోగిస్తున్నారని ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా అనుమానస్పద లావాదేవీలు నిర్వహిస్తున్న 3 లక్షల సంస్థలు ప్రభుత్వ నిఘా కింద ఉన్నాయి.


Click it and Unblock the Notifications