ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన ప్రణాళికతో జియోకు దూకుడుగా సమాధానం ఇచ్చేందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐడియా ఏం చేస్తుందో తెలుసుకుందాం.
రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు దేశంలోని ఇతర టెలికాం సంస్థలు వినూత్న రీతిలో పథకాలను తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్ ఇంతకుముందు లాగే మొబైల్ తయారీ కంపెనీలతో జట్టు కట్టి ఎయిర్టెల్ సిమ్‌తో కూడిన మొబైల్ అమ్మకాలను చేపట్టేందుకు సిద్దపడుతోంది. ఒక్కో కంపెనీ ఒక్కో విధమైన ప్రణాళికతో జియోకు దూకుడుగా సమాధానం ఇచ్చేందుకు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐడియా ఏం చేస్తుందో తెలుసుకుందాం.

ఐడియా సెల్యూలార్ ఇలా...
ఈ నెలలోనే జియో 4జీ మొబైల్ హ్యాండ్‌సెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ఐడియా సెల్యులార్ కూడా మొబైల్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియోలో కేవలం ఆ టెలికాం ఆపరేటర్‌కు సంబంధించిన యాప్స్‌కు మాత్రమే పరిమితం కాగా, ఐడియా తీసుకురానున్న కొత్త మొబైల్‌లో ఇతర యాప్స్‌ను సైతం వినియోగించుకునే వెసులుబాటును కల్పించనుంది.

జియో ఫోన్‌లో కేవలం వాళ్ల యాప్‌లే...
నెట్ వినియోగంలో అందరికీ అన్ని విషయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. వినియోగదారులు ఇష్టపడే, ఎంపిక చేసుకునే అన్ని యాప్స్ వాడుకునే వెసులుబాటును వారు(జియో) కల్పించడం లేదు. కొన్ని ఎంపిక చేసిన యాప్స్ ఇచ్చినా అన్నీ పనిచేయకపోవచ్చు. కేవలం వినియోగదారులను బలవంతంగా వారి యాప్స్‌ను మాత్రమే వినియోగించుకునేలా చేస్తున్నారు అని ఐడియా సెల్యులార్ ఎండీ హిమాన్షు కపానియా తెలిపారు.

ఐడియా తీసుకొచ్చే ఫోన్ ధర, జియో ఫోన్ కంటే ఎక్కువే
జియో ఫోన్ కన్నా కొంచెం ఎక్కువ ధరకు మొబైల్ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ సన్నాహలు చేస్తోంది. ఈ ఫోన్‌లో వినియోగించే యాప్స్ విషయంలో వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త ఫోన్.. వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది. చివరకు టెలికాం ఆపరేటర్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కూడా వారికి కల్పిస్తున్నాం. గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్ సహా అన్ని ముఖ్యమైన యాప్స్‌ను వారు వినియోగించుకోవచ్చు్ణ అని కపానియా వెల్లడించారు. ఐడియా తీసుకొస్తున్న ఈ ఫోన్ ధర సుమారు రూ.2,500 వరకూ ఉంటుందని, అయితే ఎలాంటి సబ్సిడీ ఉండదని తెలిపారు. జియో ఫోన్ ఉచితంగా ఇస్తున్నా, సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.1500 కట్టాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి ఇస్తారు.

ఇతర వివరాలు
కపానియా ఇతర వివరాలను సైతం వెల్లడించారు. ఫీచర్లను తగ్గించి, మెటీరియల్ ద్వారా అయ్యే ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. స్మార్ట్‌ఫోన్లలో 97% ఫోన్లు ఆండ్రాయిడ్ మీద పనిచేస్తాయి, కనీసం 4 ఇంచుల టచ్ స్ర్కీన్ ఉంటుంది. జియోలో టచ్ స్క్రీన్ ఉండకపోగా, మేము తెచ్చే ఫోన్లో టచ్ స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో రిలయన్స్ ఇన్ఫోకామ్ ఒక బేసిక్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అప్పుడు సైతం మొబైల్ తయారీ కంపెనీల సాయంతో పోటీ ధరల్లో ఫీచర్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేలా కృషి చేశాయి.

వినియోగదారుల విషయానికి వస్తే
అప్పట్లో(2000లో) వచ్చిన రిలయన్స్ ఫోన్ల ద్వారా రేడియషన్ సమస్య ఉండేదని చాలా మంది వినియోగదార్లు చెబుతున్నారు. కేవలం పోటీ కోసం తక్కువ ధరలో ఫోన్లను తీసుకొచ్చి వినియోగదారులకు సమస్యలు తెచ్చిపెడితే నష్టపోయేది ప్రజలే. ధర మధ్యస్థంగా ఉన్నా, నాణ్యమైన ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెడితే వినియోగదారుడికి లాభం. అంతే కానీ మార్కెట్‌విస్తరణ, పోటీ యోచనతో వినియోగదారుల ప్రయోజనాలను గాలికి వదిలేయడం మంచిది కాదు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications