ఒడిశాకు 74 పారిశ్రామిక ప్రాజెక్టులు
రూ.2 లక్షల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులు ప్రస్తుతం తమ రాష్ట్రంలో విస్తరించేందుకు సిద్దంగా ఉన్నాయని, తద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ పెరుగుతుందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి స
రూ.2 లక్షల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులు ప్రస్తుతం తమ రాష్ట్రంలో విస్తరించేందుకు సిద్దంగా ఉన్నాయని, తద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ పెరుగుతుందని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సంజీవ్ చోప్రా చెప్పారు. వైజాగ్‌లో స్థానిక వ్యాపారులతో ముచ్చటించిన తర్వాత గురువారం మీడియాతో మాట్లాడారు. ఒడిశా వ్యాపార అనుకూలమైన విధానాలతో పాటు, సులభంగా వ్యాపారం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా, తమ రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవడం సులువని, తమ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాలను ఆంధ్రప్రదేశ్ వ్యాపార వేత్తలు ఉపయోగించుకోవాలని కోరారు.

తమ రాష్ట్రంలో మంచి పారిశ్రామిక మౌలిక వసతులతో పాటు రెండు ముఖ్య పోర్టులు పారాదీప్, ధమ్రా ఉన్నాయని తెలిపారు. లోహాలు, ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్నాయని వాటిని వెలికితీసేందుకు అవకాశముందన్నారు. తమ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు నెలకొల్పాలని, అందుకోసం రాయితీలు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. డెరస్‌లో సీ ఫుడ్ పార్క్ నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోస్టల్ కార్పొరేషన్ గురించి ప్రస్తావించిన సంజీవ్ చోప్రా ఆహార ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఏపీ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications