యాజమాన్యాలు అందించే బహుమతులపై జీఎస్టీ ఉండదా!
ఉద్యోగులకు ఆయా సంస్థల యాజమాన్యం అందించే బహుమతులకు సంబంధించి విధించే జీఎస్టీపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. బహుమతి విలువ రూ.50 వేల లోపు ఉంటే, ఏడాదికి ఒకసారి ఇస్తే దానిపై ఎటువంటి జీఎస్టీ ఉండ
ఉద్యోగులకు ఆయా సంస్థల యాజమాన్యం అందించే బహుమతులకు సంబంధించి విధించే జీఎస్టీపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. బహుమతి విలువ రూ.50 వేల లోపు ఉంటే, ఏడాదికి ఒకసారి ఇస్తే దానిపై ఎటువంటి జీఎస్టీ ఉండదు. అంటే యాజమాన్యాలు ఇన్సెంటివల్‌లు, ఇతర ప్రోత్సహకాలు, బహుమతులను ఎటువంటి పన్ను లేకుండా తమ ఉద్యోగులకు బహుమతి రూపంలో ఇవ్వొచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి.

ఇంతే కాకుండా, క్లబ్, ఫిట్‌నెస్ కేంద్రాలు, జిమ్‌ల్లో సభ్యత్వం కోసం కంపెనీలు ఇచ్చే ప్రోత్సహకానికి కూడా ఎటువంటి జీఎస్టీ ఉండకుండా చేశారు.
అయితే ఉద్యోగి, యాజమాన్యం మొదట్లో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇది ఉండాలి.
ఉద్యోగి ఈ విధమైన సేవలు అందుకున్నప్పుడు కంపెనీలు దానికి తగ్గట్లు జీఎస్టీ చెల్లించాలి.
బహుమతులు ఎటువంటి షరతు లేకుండా ఇచ్చి ఉండాలి.
బహుమతి అనేది స్వచ్చందంగా ఇచ్చిందై ఉండలి.
అప్పుడప్పుడు ఇవ్వొచ్చు, తరుచూ ఇవ్వకూడదు.
ఉద్యోగి బహుమతిని తన హక్కులా డిమాండ్ చేయరాదు.


Click it and Unblock the Notifications