For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ అమెరికా నియామ‌కాలు: మ‌న‌కేం కాదు

ఇన్ఫోసిస్ అమెరికాలో స్థానిక నియామ‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన అది భార‌త్‌లో నియామ‌కాల‌పై ప్ర‌భావం చూప‌ద‌ని కంపెనీ సీఈవో విశాల్ సిక్కా అన్నారు. ఈ ఏడాది మొద‌టి త్రైమాసిక ఫ‌లితాల్లో లాభాల్లోనూ, ఆద

|

ఇన్ఫోసిస్ అమెరికాలో స్థానిక నియామ‌కాల‌కు ప్రాధాన్యం ఇచ్చినంత మాత్రాన అది భార‌త్‌లో నియామ‌కాల‌పై ప్ర‌భావం చూప‌ద‌ని కంపెనీ సీఈవో విశాల్ సిక్కా అన్నారు. ఈ ఏడాది మొద‌టి త్రైమాసిక ఫ‌లితాల్లో లాభాల్లోనూ, ఆదాయంలోనూ అంచ‌నాల‌ను మించి కంపెనీల‌ను రాబ‌ట్టిన త‌ర్వాత ప‌లు అంశాల‌పై విశాల్ సిక్కా స్పందిస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.
వ‌చ్చే కొన్నేళ్ల‌లో అమెరికాలో స్థానికంగా దాదాపు 10 వేల మందిని నియ‌మించుకునే ప్ర‌క్రియతో భార‌త్‌లో జరిగే నియామ‌కాల‌కు ఎటువంటి సంబంధం లేద‌ని చెప్పుకొచ్చారు. మ‌న దేశంలో ఈ సంఖ్య రెండు త్రైమాసికాల‌కు సంబంధించిన దాని క‌న్నా ఎక్కువేం కాద‌న్నారు. కంపెనీ ఇప్ప‌టికే క్యాంప‌స్ నియామ‌కాల ద్వారా 19వేల మందిని నియ‌మించుకుంద‌ని చెప్పారు. భార‌త్‌లో నియామ‌కాలు నెమ్మ‌దించ‌లేదు. "మేము అమెరికాలో రెండేళ్ల‌లో 10వేల మంది ఉద్యోగాల గురించి చెప్పాం. అదే భార‌త్‌లో రెండు త్రైమాసికాల కంటే త‌క్కువ స‌మ‌యంలోనే 10 వేల మందిని తీసుకుంటాం." అని విలేకరుల‌కు చెప్పారు.

 ఇన్ఫోసిస్ అమెరికా నియామ‌కాలు

జూన్ వ‌రకూ దాదాపు 10 మంది కొత్త‌గా కంపెనీలో చేరార‌ని ఆ సంస్థ సీవోవో ప్ర‌వీణ్ రావు తెలిపారు. కంపెనీ ఇంకా 12వేలు లేదా 13 వేల మందిని కొత్త‌గా తీసుకునే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. జూన్ నెల చివ‌రి నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1,98,553గా ఉంది. జీత భ‌త్యాల గురించి సీఎఫ్‌వో ఎండీ రంగ‌నాథ్ స్పందిస్తూ కంపెనీ మంచి వేరియ‌బుల్ పే ప్ర‌క‌టించింద‌ని అన్నారు. దీని ద్వారా కంపెనీ మార్జిన్‌పై 1శాతం మేర ప్ర‌భావం ఉంటుందని చెప్పారు.

Read more about: infosys software
English summary

ఇన్ఫోసిస్ అమెరికా నియామ‌కాలు: మ‌న‌కేం కాదు | infosys us recruitment will not impact new recruitment in India

On the sidelines of company's Q1 quarterly results which beat estimates on profit, revenues and margin fronts, Vishal Sikka, Infosys CEO, allays concerns among job candidates by reiterating that the hiring plans of the company in the US shall not amount to recruitment impact in India.
Story first published: Monday, July 17, 2017, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X