జియో ద్వారా ఎంత డ‌బ్బు ఆదా అవుతుంది?

జియో ధ‌న్ ధ‌నా ధ‌న్ ప్లాన్ల‌ను స‌వ‌రిస్తూ రూ.19 నుంచి మొద‌లుకొని రూ.9999 వ‌రకూ రిల‌య‌న్స్‌ జియో ర‌క‌ర‌కాల ప్లాన్ల‌ను తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా రూ.309, రూ.399 ప్లాన్ల‌ను బాగా ప్రోత్స‌హిస్తున్నార

జియో ధ‌న్ ధ‌నా ధ‌న్ ప్లాన్ల‌ను స‌వ‌రిస్తూ రూ.19 నుంచి మొద‌లుకొని రూ.9999 వ‌రకూ రిల‌య‌న్స్‌ జియో ర‌క‌ర‌కాల ప్లాన్ల‌ను తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా రూ.309, రూ.399 ప్లాన్ల‌ను బాగా ప్రోత్స‌హిస్తున్నారు. అయితే ఎయిర్‌టెల్ ఇప్ప‌టికే కొంత మంది క‌స్ట‌మ‌ర్ల‌కు 70 రోజుల 70 జీబీ ప్లాన్‌తో ముందుకొచ్చింది. జియో దూకుడుతో ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్ చాలా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయి. జియో కొత్త ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో టెలికాంలో ఉత్త‌మ ప్లాన్లు ఏవి ఉన్నాయో తెలుసుకుందాం.

జియో రూ.309 ప్లాన్‌

జియో రూ.309 ప్లాన్‌

జియో రూ.309 ప్లాన్ రీచార్జీ చేయించుకుంటే ప్ర‌తి రోజూ 1 జీబీ చొప్పున 56 రోజుల పాటు 56 జీబీ వ‌స్తుంది. 1జీబీ 4జీ డేటా అయిపోయిన త‌ర్వాత డేటా వేగం 128 కేబీపీఎస్‌కు త‌గ్గుతుంది. వీటితో పాటు లోక‌ల్; ఎస్టీడీ, రోమింగ్ ఉచితం, అంతే కాకుండా జియో నెట్‌వ‌ర్క్‌లో ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకోవ‌చ్చు.

వ్యాలిడిటీ: 56 రోజులు

డేటా : 56 జీబీ

జియో రూ.399 ప్లాన్

జియో రూ.399 ప్లాన్

జియో సిమ్‌ను వాడుతున్న వినియోగదారుల్లో ఎక్కువ మంది ఈ రీచార్జీని వాడ‌తార‌నే జియో బ‌లంగా న‌మ్ముతోంది.

84 రోజుల కాల‌వ్య‌వ‌ధికి ఈ ఆఫ‌ర్‌ను జియో రిలీజ్ చేసింది.

మొత్తం డేటా: 84 జీబీ (ప్ర‌తి రోజూ 1జీబీ)

లిమిట్ త‌ర్వాత‌: 128 కేబీపీఎస్ వేగం

ఎయిర్‌టెల్ రూ.293 ప్లాన్‌

ఎయిర్‌టెల్ రూ.293 ప్లాన్‌

జియో ఆఫ‌ర్ ప్ర‌క‌టించ‌గానే దానికి కౌంట‌ర్ ఇచ్చేందుకు వ‌దిలిన ఆఫ‌ర్ ఇది.

వ్యాలిడిటీ: 84 రోజులు

డేటా :84 జీబీ

కాక‌పోతే ఈ రీచార్జీలో ఒక తిర‌కాసు ఉంది. అన్‌లిమిటెడ్ కాల్స్ కేవ‌లం ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు మాత్ర‌మే.

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్

ప‌ట్ట‌ణ‌ మ‌ధ్య త‌ర‌గ‌తి వినియోగ‌దారులు చేజార‌కుండా ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించిన ప్లాన్ ఇది.

వ్యాలిడిటీ: 84 రోజులు

డేటా :84 జీబీ

రూ.499 ప్లాన్‌తో ఏ మొబైల్ కైనా అప‌రిమిత కాల్స్ ఉచితంగా చేసుకోవ‌చ్చు.

 ఐడియా రూ.453 ప్లాన్‌

ఐడియా రూ.453 ప్లాన్‌

టెలికాం రంగంలో వ‌స్తున్న పోటీని త‌ట్టుకునేందుకు ఐడియా సైతం మంచి ఆఫ‌ర్‌నే వ‌దిలింది.

వ్యాలిడిటీ : 84 రోజులు

డేటా :84 జీబీ

ఐడియాలో డేటా 4జీ వేగంతో కాకుండా 3జీ వేగంతో వ‌స్తుంది.

డేటాతో పాటు ప‌రిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవ‌చ్చు.

ఒక రోజుకు 300 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు లిమిట్‌.

దాని త‌ర్వాత ఒక్కో నిమిషానికి 30 పైస‌లు చార్జీ చేస్తారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+