For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీఎస్టీ ఒక వైఫ‌ల్యం: చిదంబ‌రం

ఏడు లేదా అంతకంటే ఎక్కువ పన్ను రేట్లు ఉన్న జీఎస్టీని ‘ఒకే దేశం, ఒకే పన్ను'గా పేర్కొనడం ఎంతమాత్రం సమజసం కాదని గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పెట్రోలియం, విద్యుత్, రియ

|

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దారుణమైన వైఫల్యాలతో కూడుకొని ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.చిదంబరం విమర్శించారు. ఏడు లేదా అంతకంటే ఎక్కువ పన్ను రేట్లు ఉన్న జీఎస్టీని 'ఒకే దేశం, ఒకే పన్ను'గా పేర్కొనడం ఎంతమాత్రం సమజసం కాదని గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పెట్రోలియం, విద్యుత్, రియల్ ఎస్టేట్ రంగాలను వస్తు, సేవల పన్నులో చేర్చడంతో పాటు జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించి 18 శాతం పరిమితి విధించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 జీఎస్టీని తొంద‌ర‌ప‌డి తీసుకొచ్చారన్న చిదంబ‌రం

'యుపిఎ ప్రభుత్వ హయాంలో మేము అనుకున్న జీఎస్టీ ఇది కాదు. మోదీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన జీఎస్టీ దారుణమైన వైఫల్యాలతో నిండి ఉంది. దాదాపు ఏడు రకాల పన్ను రేట్లను ఇందులో చేర్చి జీఎస్టీని అవహేళన చేశారు. 0.25 శాతం మొదలుకొని 3, 5, 12, 18, 28, 40 అంతకంటే ఎక్కువ శాతం పన్ను రేట్లతో అమలు చేస్తున్న జీఎస్టీని ఒకే దేశం, ఒకే పన్ను అని ఏవిధంగా సంబోధిస్తారు?' అని చిదంబరం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

Read more about: gst taxes tax
English summary

జీఎస్టీ ఒక వైఫ‌ల్యం: చిదంబ‌రం | NDA rolled out gst in hurry and it is a failure chidambaram

Arguing that the nation was “unprepared” and “under-prepared” for the rollout of the Goods and Services Tax, former finance minister P Chidambaram on Thursday said the NDA government has made a “mockery” of the tax reform by implementing it in a hurry and with seven or more tax rates. He demanded that the rates be reduced and capped at 18 per cent which was “eminently feasible
Story first published: Friday, July 7, 2017, 10:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X