సిగరెట్లు, పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం లేదు
జులై 1 నుంచి జీఎస్టీ పన్ను అమలు ప్రారంభమవడంతో పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లపై ఉండే అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ఆర్థిక శాఖ తొలగించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 27,2010 నాడు విడుదల చేసిన నోటి
జులై 1 నుంచి జీఎస్టీ పన్ను అమలు ప్రారంభమవడంతో పొగాకు, పాన్ మసాలా, సిగరెట్లపై ఉండే అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ఆర్థిక శాఖ తొలగించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 27,2010 నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రెవెన్యూ శాఖ వెనక్కు తీసుకుంది. దీని ప్రకారం ఉత్పత్తి చేయని టొబాకో, చూయింగ్ గమ్‌లపై అదనపు పన్ను ఉండదు.
జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ కింద.. 28 శాతం పన్ను పరిధిని దాటిన డీమెరిట్, విలాసవంతమైన వస్తువులపై ఒక సెస్సు విధించడం జరుగుతుంది.

దీని ప్రకారం పాన్ మసాలాపై సెస్సు 60%, పొగాకుపై 71-204% దాకా ఉంటుంది. ఇక సెంటెడ్ జర్దా, ఫిల్టర్ ఖైనీపై 160%, గుట్కా ఉన్న పాన్‌మసాలాపై 204 శాతం సెస్సు విధిస్తారు. 65 మి.మీ. పైగా 70 మి.మీ. లోపు పొడవుండే నాన్ ఫిల్టర్ సిగరెట్స్ వెయ్యికి 5 శాతం సెస్సుతో పాటు రూ. 2,876.. ఫిల్టర్ సిగరెట్స్ అయితే 5 శాతంతో పాటు రూ. 2,126 సెస్ విధిస్తారు. సిగార్లపై అత్యధికంగా ప్రతి వెయ్యిపై 21 శాతం లేదా రూ. 4,170 (ఏది ఎక్కువైతే అది) సెస్సు ఉంటుంది.


Click it and Unblock the Notifications