జులై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు అవనుండటంతో పరోక్ష పన్నుల విధానంలో చాలా మార్పులు జరుగుతాయి. నేరుగా కాకపోయినా పరోక్షంగా అయినా ప్రజలపై వివిధ రూపాల్లో ధరల ప్రభావం పడుతుంది. అయితే క
జులై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు అవనుండటంతో పరోక్ష పన్నుల విధానంలో చాలా మార్పులు జరుగుతాయి. నేరుగా కాకపోయినా పరోక్షంగా అయినా ప్రజలపై వివిధ రూపాల్లో ధరల ప్రభావం పడుతుంది. అయితే కేవలం జీఎస్టీనే కాదు జులై 1 నుంచి ఇంకా కొన్ని మార్పులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయనున్నాయి. జులై 1 నుంచి జీఎస్టీ కాకుండా ఇంకా జరగబోయే కొన్ని ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం.

రైల్వే ఈ-టిక్కెట్లు
జులై 1 నుంచి రాజధాని, శతాబ్ది ట్రైన్ టిక్కెట్లు కాగిత రహితంగా మారనున్నాయి. నగదు రహిత, కాగిత రహిత వ్యవస్థను ప్రోత్సహించేందుకు రైల్వే కంకణం కట్టుకుని ఉంది. మొట్టమొదట రాజధాని ఎక్స్‌ప్రెస్, శతాబ్ది రైళ్లతో మొదలుకొని అన్ని రైళ్లకు పేపర్ లెస్ టిక్కెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారు తనిఖీల సమయంలో ఈ-టిక్కెట్లను చూపిస్తే సరిపోతుంది.

ఐటీ రిటర్నులు
జులై 1 నుంచి ఐటీ రిటర్నులకు ఆధార్ తప్పనిసరి. ఆదాయపు పన్ను వెబ్‌సైట్లో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు చేసేందుకు ఇంతకుముందు యూజర్ ఐడి, పాస్ వర్డ్ ఉంటే చాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆధార్ ఉంటేనే ఐటీ రిటర్నులు సమర్పించగలరు. జులై 1 తర్వాత ఆధార్ లేకుండా ఐటీ రిటర్నులు చేయలేరని గుర్తుంచుకోండి.

ఆధార్- పాన్ అనుసంధానం
ఆధార్ సంఖ్యను పాన్‌తో అనుసంధానించడాన్ని సైతం కేంద్రం తప్పనిసరి చేసింది. ఆధార్ లేని వారు సైతం దరఖాస్తు చేసిన తర్వాత ఉండే ఎన్‌రోల్‌మెంట్ నంబరును ఇవ్వాల్సిందేనని కేంద్రం తేల్చిచెప్పింది. ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉపయోగించి పన్ను ఎగవేతలు చేయకుండా నిరోధించేందుకు ఇది చేస్తున్నారు. ఆదాయపు పన్ను చట్టంలో ఈ మేరకు సవరణలు చేశారు. ఎవరైనా పాన్-ఆధార్ అనుసంధానించకపోతే పాన్ ఇన్‌వాలిడ్ అవుతుందని ఐటీ శాఖ హెచ్చరిస్తోంది.

డిపార్చర్ కార్డులు
జులై 1 నుంచి విదేశాలకు వెళ్లే వారికి డిపార్చర్ కార్డులు అవసరం లేదు. దీని వల్ల మన దేశం నుంచి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో అది కాస్త సులువు అవుతుంది. ప్రజలు రైలు, పోర్టులు, ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద ఎంబార్కేషన్(embarkation) కార్డు కోసం వివరాలు ఇవ్వాలి. ఈ మార్పు కారణంగా ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీలకు అయ్యే సమయం తగ్గుతుంది.

పాస్ పోర్టు
ఆధార్ కార్డు లేకుండా పాస్‌పోర్టు తెచ్చుకోవడం ఇకపై కష్టమే. ఎందుకంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాస్ పోర్టుకు అవసరమైన పత్రాల్లో ఆధార్‌ను తప్పనిసరి చేసింది. కాబట్టి జులై 1 తర్వాత ఆధార్ లేకుండా పాస్‌పోర్టు దరఖాస్తు కష్టమే.

పీఎఫ్ ఖాతా, ఆధార్
జూన్ 30 నాటికల్లా పీఎఫ్ ఖాతాను ఆధార్ సంఖ్యతో అనుసంధానించాలని ఈపీఎఫ్‌వో ఆదేశించింది. పింఛను తీసుకునేవారు సైతం ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనని తెలిపారు.
ఆధార్ నంబరు ప్రావిడెంట్ ఫండ్ సంస్థ వద్ద ఉంటే పీఎఫ్ విత్‌డ్రాయల్, సెటిల్‌మెంట్ సులభంగా పూర్తవుతాయి. ఇంతకుముందు 20 రోజులు పట్టే ప్రక్రియను ఇప్పుడు 10 రోజులకు తగ్గించారు.

రైల్వే రాయితీ
రైల్వే శాఖ వృద్దులకు, వికలాంగులకు కొన్ని రాయితీలను కల్పిస్తోంది. జులై 1 నుంచి ఇవి పొందాలంటే ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సిందే. అర్హత లేని వారు ఇటువంటి వాటిని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ విధంగా చేశారు.

ఉపకార వేతనాలు
మీరు విద్యార్థి అయి ఉండి, ప్రభుత్వం నుంచి ఏదైనా ఉపకార వేతనం పొందుతున్నట్లయితే అందుకోసం జులై 1 తర్వాత ఆధార్ నంబరును ఇవ్వాల్సిందే. ఆధార్ లేకపోతే మీకు దక్కాల్సిన ప్రయోజనాన్ని పొందేందుకు వీలు కాదు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం జూన్ 30 తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉపకార వేతనాలు అందుకోవాలనుకుంటున్నారో వారు ఆధార్ వివరాలను ఇవ్వడం తప్పనిసరి.

జీఎస్టీ
దేశవ్యాప్తంగా పరోక్ష పన్నుల్లో ఏకరీతి విధానం సాధించడమే జీఎస్టీ లక్ష్యం. జులై 1 నుంచి దేశమంతా వ్యాట్, ఎక్సైజ్, కస్టమ్స్ వంటివి తొలగి కేవలం ఒకే పన్ను జీఎస్టీ మాత్రమే ఉంటుంది. దేశాన్నంతటినీ ఒకే మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు ఇది పనికొస్తుంది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అనేది జీఎస్టీ ప్రధాన నినాదం.

గ్యాస్ రాయితీ
గ్యాస్ సబ్సిడీ, రేషన్ దుకాణంలో వచ్చే ప్రయోజనాలు పొందాలంటే కూడా లబ్దిదారు ఆధార్ నంబరు ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలు ప్రతి రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలకు, పేద వారికి ఇచ్చే ప్రయోజనాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆధార్ సంఖ్యను ఇవ్వాల్సిందిగా అడుగుతోంది. రేషన్ కార్డుదారులంతా ఆధార్ నంబరు అనుసంధానించి ప్రభుత్వం ఇచ్చే బియ్యం, గ్యాస్ సబ్సిడీ వంటి వాటిని నిరాటంకంగా పొందవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications