మార్కెట్లోకి మళ్లీ నోకియా ఫోన్లు
ఒకప్పుడు మొబైల్ అంటే నోకియా అనేలా చలామణీ అయిన మొబైల్ సంస్థ మార్కెట్లోకి మళ్లీ స్మార్ట్‌ఫోన్లతో పునరాగమనం చేస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ అనే ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్ ద్వారా నోకియా తిరిగ
ఒకప్పుడు మొబైల్ అంటే నోకియా అనేలా చలామణీ అయిన మొబైల్ సంస్థ మార్కెట్లోకి మళ్లీ స్మార్ట్‌ఫోన్లతో పునరాగమనం చేస్తోంది. హెచ్ఎండీ గ్లోబల్ అనే ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్ ద్వారా నోకియా తిరిగి స్మార్ట్‌ఫోన్లను తయారుచేసి మన దేశంలోకి తీసుకొచ్చింది. మొదట నోకియా 3 స్మార్టఫోన్‌తో మొదలుపెట్టి తర్వాత నోకియా5, నోకియా 6 ఫోన్లను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచనున్నారు. నోకియా స్మార్ట్‌ఫోన్ల గురించి మరిన్ని వివరాలు మీ కోసం...

ఏయే ఫోన్లు
నోకియా 3, నోకియా 5 ఫోన్లను మన దేశంలోనే రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచుతారు. నోకియా 3, నోకియా 5 ధరలు వరుసగా రూ.9499, రూ. 12,899గా ఉంటాయి. అయితే ఎక్కువ ధర ఉండే నోకియా 6 మాత్రం ప్రత్యేకంగా అమెజాన్ ఇండియాలో మాత్రమే దొరుకుతుంది. దీని ధర రూ.14,999 గా ఉంటుందని నోకియా తెలిపింది.

ఎప్పటి నుంచి
ఈ నెల నుంచే నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్లు దేశంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 16(శుక్రవారం) నుంచి నోకియా3 వస్తోంది. నోకియా5 ప్రీ బుకింగ్ జులై 7 వ తేదీ ప్రారంభమవుతుంది. నోకియా 6 మాత్రం జులై చివరకు ఇండియాలోకి ప్రవేశపెడతారు. నోకియా 6 కొనాలనుకునే వారికి ప్రీ బుకింగ్ జులై 14 నుంచి మొదలవుతుంది.

3. ఫోన్లు-ఫీచర్లు
నోకియా 6 ఫోన్ 5.5 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. డిస్‌ప్లేకు సంబంధించి గొరిల్లా గ్లాస్ కవరేజీ ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ 403పీపీఐ. సన్ లైట్ ఉన్నప్పటికీ చదువుకునే వీలుండటం దీని ప్రత్యేకత. నోకియా 6 ఫోన్ సైజ్ 154 x 75.8 x 7.85 ఎమ్ఎమ్‌గా ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌తో పాటు 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ఇచ్చారు. దీన్ని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు.

4. ప్రత్యేకతలు
4జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ స్టోరేజీ ఉండేలా బ్లాక్ కలర్ ఫోన్లను చాలా పరిమితంగా తీసుకువస్తున్నారు. స్టోరేజీని కావాలంటే పెంచుకోవచ్చు. కెమెరా 16 మెగా పిక్సెల్. ఫ్రంట్ కెమెరా 8ఎంపీతో పాటు ఆటోఫోకస్ సదుపాయంతో వస్తుంది. 3000 ఎంఏహెచ్ బ్యాటరీకి అదనంగా మైక్రో యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ సైతం ఇచ్చారు.

5. ఎల్‌టీఈ
నోకియా 6 ఫోన్‌లో యాక్సెలరోమీటర్, లైట్ సెన్సార్, ఈ-కంపాస్, హాల్ సెన్సార్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, గైరో స్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ(షేరింగ్) వంటివి ఉంటాయి. వైఫ్, బ్లూటూత్ 4.1, యూఎస్‌బీ సపోర్ట్ సైతం ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ సైతం ఫింగర్ ప్రింట్ స్కానర్ నోకియా6లో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో పాటు స్పీకర్లు ఉంటాయి. 4జీ ఎల్‌టీఈ సపోర్ట్‌తో పాటు ఎల్‌టీఈ బాండ్లలో కొన్నింటికి ఈ ఫోన్ పనికొస్తుంది. ఇండియాలో ఉండే బాండ్లలో బాండ్ 41 కాకుండా చాలా బాండ్లకు ఇది సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

6. నోకియా 5 ఫీచర్లు
నోకియా 5 కొద్దిగా తక్కువ ఫీచర్లు, ధర ఉండే ఫోన్. మొత్తం మెటల్ డిజైన్, 5.2 ఇంచెస్ డిస్‌ప్లే, సన్‌లైట్ విజిబిలిటీ ఇంప్రూవ్‌మెంట్ వంటి ఫీచర్లున్నాయని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. నోకియా 5 ఫోన్ సైజ్ 149.7 x 72.5 x 8.05ఎమ్ఎమ్‌గా ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వంటివి ఉన్నాయి. ఫోన్ ఇంటర్నల్ సామర్థ్యాన్ని 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది.

7. నోకియా 3
5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, మంచి బ్యాటరీ వంటి ఫీచర్లతో నోకియా 3 మార్కెట్లోకి ప్రవేశించనుంది. బ్యాటరీ సామరథ్యం 2650 ఎంఏహెచ్ గా ఉంటుందని, మైక్రో యూఎస్‌బీ(2.0) చార్జింగ్ పోర్ట్ సైతం కలదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications