9 నైపుణ్యాల ద్వారా ఐటీ రంగంలో నిల‌దొక్కుకోవ‌చ్చు

భార‌త ఐటీ రంగం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఎగుమ‌తులు చేయ‌డానికి దేశంలో ఉన్న యువ శ‌క్తి. అయితే 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత అంద‌రూ బీ.టెక్ చ‌దువులు చ‌దివి త‌గిన నైపుణ్యాలు లేక‌, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే స్థాయి

భార‌త ఐటీ రంగం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఎగుమ‌తులు చేయ‌డానికి దేశంలో ఉన్న యువ శ‌క్తి. అయితే 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత అంద‌రూ బీ.టెక్ చ‌దువులు చ‌దివి త‌గిన నైపుణ్యాలు లేక‌, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే స్థాయి ప‌రిశ్ర‌మ‌కు లేక నిరుద్యోగిత ఎక్కువ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌రిశ్ర‌మ‌లో ఉన్న చాలా మంది నైపుణ్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగుప‌రుచుకోవ‌డం లేద‌ని కంపెనీ సీఈవోలే చెబుతున్న మాట‌. ఈ మ‌ధ్య ఇన్ఫోసిస్ మాజీ హెచ్ఆర్‌ అధిప‌తి మోహ‌న్‌దాస్ ప‌య్ మాట్లాడుతూ భ‌విష్య‌త్తులో ఎం.టెక్ డిగ్రీలు లేనిదే ఐటీ రంగంలో నెట్టుకురావ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం గ్రాడ్యుయేట్లు, లేదా ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు పెంపొందించుకోవ‌ల్సిన 9 ల‌క్ష‌ణాల‌ను గురించి తెలుసుకుందాం.

 స్వ‌త‌హాగా మీ కంటూ కొన్ని ల‌క్ష‌ణాలు

స్వ‌త‌హాగా మీ కంటూ కొన్ని ల‌క్ష‌ణాలు

ఒక్కొక్క‌రిలో ఒక్కో బ‌లం ఉంటుంది. కొంత మంది టీమ్‌ను స‌మ‌న్వ‌య‌ప‌ర‌చ‌గ‌ల‌రు, కొంత మంది కొత్త ఐడియాల‌ను ఇవ్వ‌గ‌ల‌రు. కొంత మంది స‌మ‌య పాల‌న క‌చ్చితంగా నిర్వ‌హించ‌గ‌ల‌రు. నిరంతరం మిమ్మ‌ల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకుంటూ ఇత‌రుల‌ను సైతం మోటివేట్ చేయ‌గ‌ల స‌త్తా ఉంటే మీ ఉద్యోగం పోతుంద‌నే భ‌యం ఉండ‌దు. మ‌నుషుల‌ను మ‌నుషులే మేనేజ్ చేయాల్సి ఉన్నందును ఈ ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తులు పైకి ఎదిగేందుకు అవ‌కాశాలు ఉన్నాయి.

ఏదైనా సొంతంగా చేయ‌గ‌లిగేలా ఉండాలి

ఏదైనా సొంతంగా చేయ‌గ‌లిగేలా ఉండాలి

మీకు కోడింగ్ బాగా వ‌చ్చి ఉండొచ్చు. మ‌రొక‌రికి డేటా మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉండొచ్చు. వాటిని పూర్తిగా వినియోగించుకోవాలి. ఎలా అంటే ఉదాహ‌ర‌ణ‌కు మీరు డేటాబేస్‌, పీహెచ్‌పీ, హెచ్‌టీఎమ్ఎల్‌, సీఎస్ఎస్‌, జావా స్క్రిప్ట్ వంటి వాటి మీద ప‌ట్టుక‌లిగి ఉంటే సొంతంగా వెబ్‌సైట్ లేదా యాప్ త‌యారుచేయ‌డానికి ప్ర‌య‌త్నించండి. హెచ్ఆర్ మేనేజ‌ర్లంతా ఇలాంటి వారి కోసం ఎదురు చూస్తారు. కేవ‌లం మీరు చేస్తున్న ప‌ని కాకుండా అధిక నైపుణ్యాల కోసం ఎప్పుడూ ప‌నిచేస్తుండాలి.

విశ్లేష‌ణ‌

విశ్లేష‌ణ‌

ఏదైనా కొత్త యాప్ లేదా వెబ్‌సైట్ వ‌చ్చిన‌ప్పుడు మ‌నుషుల స్పంద‌న ఎలా ఉందో గ‌మ‌నించే నేర్పు ఉంటే దాన్ని విశ్లేషించే ప్ర‌య‌త్నం చేయండి. ఉత్ప‌త్తి మార్కెట్లో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏం జ‌రిగిందో ద‌శ‌ల వారీగా స‌మాచారాన్ని సేక‌రించ‌వ‌చ్చు. మీకు మీరుగా ప్రోటో టైప్‌లు త‌యారుచేయ‌వచ్చు. ఇలా చేస్తే మీరు ఒక మంచి హ్యూమ‌న్ ఇంట‌రాక్ష‌న్ డిజైన‌ర్ అవుతారు. రోబోట్ల‌తో మాన‌వ ప‌నితీరును అంచ‌నా వేయ‌డం అంత సులువైన వ్య‌వ‌హార‌మేమీ కాదు. ఒక వ్య‌క్తిని అర్థం చేసుకోవాలంటే మ‌రో వ్య‌క్తే కావాలి.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేథ ఇప్పుడు ఐటీ రంగంలో కొన్ని ఉద్యోగాలు పోవ‌డానికి కార‌ణం అవుతోంది. ఎంత కృత్రిమ మేథ ఉన్నా చివ‌ర‌కు దాన్ని స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డానికి మాన‌వ వ‌న‌రులు అవ‌స‌ర‌మే. ఈ విధంగా ఆలోచిస్తే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌ర‌కు డిమాండ్ తక్కువేమీ కాదు. గ‌ణిత శాస్త్రంపై కాస్త ప‌ట్టు ఉండి మంచి విశ్లేష‌ణ‌, గ‌ణ‌న చేయ‌గ‌లిగితే మీ జాబ్ ప్రొఫైల్‌కు అది ఎప్ప‌టికి ఉప‌యోగ‌మే. ఇప్పుడున్న త‌రుణంలో డెవ‌ల‌ప‌ర్ల‌కు కోడింగ్ మీద మాత్రం త‌ప్ప‌నిస‌రిగా గురి ఉండాలి.

 మెషీన్ లెర్నింగ్ రీసెర్చ‌ర్‌

మెషీన్ లెర్నింగ్ రీసెర్చ‌ర్‌

ఏదైనా క‌ష్ట‌మైన ప‌నిని చిన్న చిన్న ద‌శ‌ల్లో విభ‌జించి ఎలా సులువుగా పూర్తి చేస్తారో తెలిసి ఉండాలి. ఐటీ కంపెనీల్లో క‌నీసం 60% మంది జాబ్ ప్రొఫైల్‌లో మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్ నైపుణ్యం కూడా తోడ‌వ్వాల్సి వ‌స్తోంది. అంటే ఒక స‌మ‌స్య‌ను సాంకేతిక‌తో ఎలా ప‌రిష్క‌రించ‌వ‌చ్చో ఆలోచించ‌గ‌ల‌గాలి. మెషీన్ లెర్నింగ్ అల్గారిథ‌మ్‌లు త‌యారుచేయ‌డం, కొత్త వాటిని నేర్చుకోడంపైన దృష్టి పెట్టాలి.

మెషీన్ లెర్నింగ్ యాప్ డెవ‌ల‌ప‌ర్‌

మెషీన్ లెర్నింగ్ యాప్ డెవ‌ల‌ప‌ర్‌

మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్‌కు ఆర్టిఫిషియ‌ల్ సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్ కూడా జ‌త క‌లిస్తే మీరు మెషీన్ లెర్నింగ్ యాప్ డెవ‌ల‌ప‌ర్ అయ్యే వీలుంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లిష్ట స‌మ‌స్య‌ల‌కు సులువైన ప‌రిష్కారాల కోసం ప‌నిచేయాలి.

3 డీ డిజైన‌ర్లు

3 డీ డిజైన‌ర్లు

ఒక‌ప్పుడు ప్రింటింగ్ టెక్నాల‌జీలో 3డీ ప్రింటింగ్ సాంకేతిక‌త గురించి మాట్లాడితే విచిత్రంగా చూసేవారు. చివ‌రకు అసాధ్య‌మైన 3డీ ప్రింటింగ్‌ను సైతం వెలుగులోకి తీసుకొచ్చారు. 3డీ ప్రింటింగ్ కంపెనీల వారికి సృజ‌నాత్మ‌క 3డీ డిజైన‌ర్లు కావాలి. మీకు గ‌న‌క డిజైనింగ్‌లో అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచ‌న ఉండుంటే మీకు ఆ ప‌రిశ్ర‌మ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది. మీరు చేయాల్సింద‌ల్లా ఒక ఆలోచ‌న‌ను తీసుకుని దాన్ని సాధార‌ణ జీవితానికి అన్వ‌యించాలి.

కంటెంట్ ఇంజినీరింగ్‌

కంటెంట్ ఇంజినీరింగ్‌

ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం, ఇంటర్నెట్ అనుసంధాన‌త పెరిగే కొద్దీ కంటెంట్ వ్యాపారం రోజురోజుకు విస్త‌రిస్తోంది. ప‌రిశ్ర‌మ కంటెంట్ ఇంజినీర్ల కోసం చూస్తోంది. కంటెంట్ సృష్టించ‌డ‌మంటే ఏదో ఒక దాన్ని యూజ‌ర్ల‌కు అందించ‌డం కాదు. వారి అవ‌స‌రానికి అనుగుణంగా మార్పులు చేయాలి. నిరంతర విశ్లేష‌ణ‌తో ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాలి. మోడ‌ల్‌, మెటా డేటా, మార్క్ అప్‌, స్కీమా, ట్యాక్సాన‌మీ వంటి ఐదు విభాగాల్లో కొత్త నైపుణ్యాలు జ‌త చేరుతూ ఉండాలి.

బిగ్ డేటా

బిగ్ డేటా

ఐబీఎం లాంటి కంపెనీలు బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ వ‌ల్ల వ‌చ్చే లాభాల‌ను ముందే గ్ర‌హించాయి. ప్ర‌స్తుతం డేటా ఒక విప్ల‌వాన్ని తీసుకొచ్చింది. బిగ్ డేటా ఎక్స్‌ప‌ర్ట్ల‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. లెక్క‌లు, స్టాటిస్టిక్స్ వంటి వాటిని ఇష్ట‌ప‌డే వారు నంబ‌ర్ల‌తో ఆడుకుంటూ ఒక తుది ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌గ‌లిగే వారికి సాఫ్ట్‌వేర్ రంగం విస్తృత అవ‌కాశాల‌ను ఇస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు స్కిల్స్‌ను పెంచుకోవాల్సిందే

ఎప్ప‌టిక‌ప్పుడు స్కిల్స్‌ను పెంచుకోవాల్సిందే

సాఫ్ట్‌వేర్ రంగంలో అప్ అండ్ డౌన్లు ఎప్పుడు వ‌స్తాయో ఎవ‌రూ ఊహించ‌లేరు. బీ.టెక్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లో కోట్ల‌లో ఉన్న కార‌ణంగా ప‌రిశ్ర‌మ అంద‌రికీ అవ‌కాశాలివ్వ‌లేదు. ఏదో విధంగా జాబ్ తెచ్చుకున్నా కొత్త టెక్నాల‌జీల విష‌యంలో ముందు చూపు ఉండాల్సిందే. వివిధ అనుభ‌వాల రీత్యా నైపుణ్యాల‌ను స‌మీక‌రించి ఇక్క‌డ ఇవ్వ‌డం జ‌రిగింది. ఇవి కాకుండా మీకు తెలిసిన మరిన్ని నైపుణ్యాలు ఉంటే కామెంట్ల ద్వారా స్పందించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+