భారత జీడీపీ 7.2%: ప్రపంచ బ్యాంకు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 7.2 శాతంగా నమోదవొచ్చని ప్రపంచబ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు పేదవారిపైన ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం అమ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 7.2 శాతంగా నమోదవొచ్చని ప్రపంచబ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు పేదవారిపైన ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేయబోయే జీస్టీ విషయంలో అలా కాదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. పెద్ద నోట్ల మార్పిడి(రద్దు) సాఫీగా సాగుతున్న వృద్దికి విఘాతం కలిగించిందని విశ్లేషించారు. ఈ మేరకు 'ఇండియా డెవలప్‌మెంట్ రిపోర్ట్'ను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. గతేడాది చక్కని వర్షపాతం తర్వాత పరిస్థితులు మెరుగుపడుతుండగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం భారత వృద్ధికి విఘాతం కలిగించిందని ప్రపంచ బ్యాంకు వివరించింది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతంగా జీడీపీ రేటు ఉండొచ్చని తెలిపింది. ''భారత్ ఇకపైనా ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. జీఎస్టీ అమలు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది'' అని బ్యాంకు దేశీయ డైరెక్టర్ జునైద్ అహ్మద్ తెలిపారు.

దివాలా చట్టంతో బ్యాంకుల్లో నిరర్దక ఆస్తులు తగ్గుముఖం పడతాయి. జీఎస్టీ అమలు కారణంగా దేశ ఆర్థిక వృద్ది మరో సారి భారత్‌లో స్థిరమైన వృద్ది కొనసాగుతుందని బ్యాంకు పేర్కొంది. పేదల పైన భారం మోపకుండానే భారత్ జీఎస్టీ చట్టాన్ని అమలు పరచబోతోంది. పరోక్ష పన్నుల చట్ట సంస్కరణలో ఇదో విప్లవాత్మక మార్పని ఆయన అభిప్రాపడ్డారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ లావాదేవీల్లో పురోగతి, గ్రామీణ ఆదాయంలో వృద్ది, ప్రజోపయోగకరమైన పనులపై వ్యయం పెరుగుతుండటంతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా వృద్ది చెంది దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది.


Click it and Unblock the Notifications