ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)..ఫోర్బ్స్ మ్యాగజైన్ గ్లోబల్ 2000 జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. 4,180 కోట్ల డాలర్ల విక్రయాలు, 430 కోట్ల డాలర్ల లాభం, 97
* మన దేశం నుంచి రిలయన్స్ టాప్
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)..ఫోర్బ్స్ మ్యాగజైన్ గ్లోబల్ 2000 జాబితాలో భారత్ నుంచి మొదటి స్థానంలో నిలిచింది. 4,180 కోట్ల డాలర్ల విక్రయాలు, 430 కోట్ల డాలర్ల లాభం, 9790 కోట్ల డాలర్ల ఆస్తులు, 7,120 కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఈ లిస్టులో 106వ స్థానం దక్కింది. గతేడాది టెలికం రంగంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి పెట్టుబడిదారుల్లో సంస్థపై నమ్మకం మెరుగుపడటంతో ఆర్‌ఐఎల్ షేరు ధర భారీగా పుంజుకుందని ఫోర్బ్స్ ఇండియా ఎడిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో టాప్ బ్రాండ్లు

ఈ జాబితాలో గతేడాది 56 దేశీయ సంస్థలకు చోటు దక్కగా, ఈసారి 58 సంస్థలకు చోటు లభించింది.అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ ఆధారంగా ర్యాంకులు ప్రకటించినట్లు ఫోర్బ్స్ వెబ్‌సైట్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. గతేడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న దేశీయ కంపెనీల్లో బ్యాంకులు, ఐటీ రంగానికి చెందినవే అధికం. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సేవల సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 244వ స్థానం దక్కింది. గతేడాది బ్యాంక్ 146వ స్థానంలో ఉంది. అలాగే ప్రభుత్వరంగ ఇంధన సంస్థ ఓఎన్‌జీసీకి 246వ స్థానం(గతేడాది 220) లభించింది. ప్రపంచ స్థాయి ఆర్థిక సేవల కంపెనీల విభాగంలో భారత మూలాలు కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌కు అంతర్జాతీయంగా టాప్-10లో స్థానం దక్కడం విశేషం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications