2017లో రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐల రాక‌

ఒక ప‌క్క ప్ర‌పంచ‌మంత‌టా వివిధ దేశాల్లోకి ఎఫ్‌డీఐలు రావ‌డం త‌గ్గిపోతుంటే, భార‌త్‌లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎఫ్‌డీఐల రాక 9% మేర పెరిగి 43.5 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున

ఒక ప‌క్క ప్ర‌పంచ‌మంత‌టా వివిధ దేశాల్లోకి ఎఫ్‌డీఐలు రావ‌డం త‌గ్గిపోతుంటే, భార‌త్‌లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఎఫ్‌డీఐల రాక 9% మేర పెరిగి 43.5 బిలియ‌న్ల డాల‌ర్ల‌కు చేరుకున్నాయి. అయితే జ‌న‌వ‌రి-మార్చి త్రైమాసికంలో మాత్రం ఎఫ్‌డీఐ ఈక్విటీల రాక 28% త‌గ్గి 7.6 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండ‌స్ట్రియ‌ల్ పాల‌సీ ప్ర‌మోష‌న్ ఈ మేర‌కు శుక్ర‌వారం స‌మాచారాన్ని విడుద‌ల చేసింది.

 గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో రికార్డు ఎఫ్‌డీఐల రాక‌

భార‌త్‌లోకి ఎఫ్‌డీఐల రాక వివిధ దేశాల నుంచి ఈ విధంగా ఉంది. మారిష‌స్ నుంచి 15.7 బిలియ‌న్ డాల‌ర్లు, సింగ‌పూర్ నుంచి 8.7 బిలియ‌న్ డాల‌ర్లు నిధులు వ‌చ్చాయి. సేవారంగం(8.9 బి. డాల‌ర్లు), టెలికాం(5.6 బి.డాల‌ర్లు) ఎక్కువ నిధుల‌ను రాబ‌ట్టగ‌లిగాయి. 2014-15 నుంచి 2016-17 వ‌ర‌కూ మూడు ఆర్థిక సంవ‌త్స‌రాల్లో దేశంలోకి 114.41 బిలియ‌న్ డాల‌ర్లు విదేశీ నిధులు వ‌చ్చాయి. 2011-12, 2012-13, 2013-14 వ‌రుస మూడు సంవ‌త్స‌రాల్లో పోలిస్తే ఇటీవ‌లి మూడేళ్ల‌లో ఎఫ్‌డీఐ ఈక్విటీల రాక 40% వృద్ది న‌మోద‌యింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+