For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆస‌క్తి చూప‌ని భార‌తీయులు

గ‌త సంవ‌త్స‌రం కాలం నుంచి స్టాక్‌ మార్కెట్లు బాగా రాణిస్తుండటంతో అటువైపు ఆకర్షితులైన పెట్టుబ‌డిదార్లు గోల్డ్ ఈటీఎఫ్‌లపై శీతకన్నేశారు. ఏప్రిల్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి 66 కోట్ల రూపాయలు ఉపసంహరించారు

|

గ‌త సంవ‌త్స‌రం కాలం నుంచి స్టాక్‌ మార్కెట్లు బాగా రాణిస్తుండటంతో అటువైపు ఆకర్షితులైన పెట్టుబ‌డిదార్లు గోల్డ్ ఈటీఎఫ్‌లపై శీతకన్నేశారు. ఏప్రిల్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి 66 కోట్ల రూపాయలు ఉపసంహరించారు. వరుసగా నాలుగు సంవత్సరాలుగా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల విభాగం బేరీష్‌గా ఉన్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. 2013-14 సంవత్సరంలో 2293 కోట్లు, 2014-15 సంవత్సరంలో 1475 కోట్లు, 2015-16 సంవత్సరలో 903 కోట్ల రూపాయల నిధులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబ‌డిదారులు వెన‌క్కు తీసుకున్న‌ట్లు ఎఎంఎఫ్‌ఐ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే ఒక్కో ఏడాది గడుస్తున్న కొద్ది ఉపసంహరించుకుంటున్న సొమ్ము పరిమాణం తగ్గుతూ వస్తోంది. బంగారంపై వివిధ ర‌కాల‌ పెట్టుబ‌డులు

 గోల్డ్ ఈటీఎఫ్‌ల విష‌యంలో మ‌నోళ్ల‌కు ఆస‌క్తి లేదంట‌

తాజా గణాంకాల ప్రకారం... 14 గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఈ ఏడాది మార్చిలో 80 కోట్ల రూపాయలు ఉపసంహరించగా ఏప్రిల్‌లో 66 కోట్ల రూపాయలు ఉపసంహరించారు. మార్చి చివరి నాటికి గోల్డ్‌ ఫండ్‌ల ఆస్తుల విలువ 5,480 కోట్ల రూపాయలుండగా ఏప్రిల్‌ చివరికి 5,377 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఈక్విటీ, ఈక్విటీ అనుసంధానిత పొదుపు స్కీమ్‌లలో నికరంగా 9,429 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేశారు. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం విలువ 2012-13 సంవత్సరంలో 1,900 డాలర్ల గరిష్ఠస్థాయికి చేరిన తర్వాత క్రమంగా దిగజారుతూ ప్రస్తుతం 1,050-1,350 డాలర్ల పరిధిలో కదలాడుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి బలం పుంజుకుంటూ ఉండడంతో దేశీయ విపణిలో కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బంగారాన్ని కొనే ముందు

Read more about: april gold investors gold etf
English summary

గోల్డ్ ఈటీఎఫ్‌లపై ఆస‌క్తి చూప‌ని భార‌తీయులు | Gold ETFs see Rs 66 cr outflow in April

Trading in gold ETF segment has been tepid during the last four financial years. It had witnessed an outflow of Rs 903 crore, Rs 1,475 crore and Rs 2,293 crore in 2015-16, 2014 -15 and 2013-14 respectively
Story first published: Thursday, May 11, 2017, 10:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X