పండుగ సీజన్లలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా బంగారం కొనుగోలు చేయాలని కోరుకుంటారు. భారత్లో బంగారం కొనుగోలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడానికి ముందు దాని గురించి క్షణ్ణంగా
పండుగ సీజన్లలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా బంగారం కొనుగోలు చేయాలని కోరుకుంటారు. భారత్లో బంగారం కొనుగోలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే బంగారం కొనుగోలు చేయడానికి ముందు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
కొన్ని సందర్భాల్లో బంగారం గురించి మీకు తెలియకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బంగారం కోనుగోలు చేయాలంటి వీటి గురించి మీకు తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి.

1. హాల్ మార్క్ చెక్ చేయాలి
హాల్ మార్క్ అనేది నగలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేయబడ్డాయని హామీని ఇస్తుంది. హాల్ మార్క్ ఉంటే నగలు ఏ సంవత్సరంలో తయారు చేశారు, బీఐఎస్ లోగో, జ్యూయలర్స్ మార్క్, హాల్ మార్కింగ్ సెంటర్ మార్క్, కోల్ లెటర్ మొదలగునవి బంగారం కలిగి ఉంటుంది.

2. బంగారాన్ని మెల్టింగ్ చేయడం వల్ల ఖరీదైనదిగా రుజువు చేయవచ్చు
మీ దగ్గర ఉన్న బంగారాన్ని కరిగిచడం వల్ల హాల్ మార్క్ పోయే ప్రమాదం ఉంటుంది. సుమారు మీరు 10 గ్రాముల బంగారాన్ని కరిగించినట్లైతే అది 7 గ్రాములు అవుతుంది. దీంతో మీరు బంగారం బరువుతో పాటు డబ్బుని కూడా కోల్పోవాల్సి ఉంటుంది.

3. క్యారెట్స్ను చెక్ చేసుకోవాలి
బంగారం సాప్ట్‌గా ఉంటుంది కాబట్టి నగలు చేసేటప్పుడు బంగారంతో సిల్వర్, జింక్ లాంటి మెటల్స్ జోడించి జ్యూయలరీని తయారు చేస్తారు. బంగారం యొక్క నాణ్యతను క్యారెట్ తెలుపుతుంది. క్యారెట్స్‌ను చెక్ చేయకుండా బంగారాన్ని కొనుగోలు చేయకూడదు. సాధారణంగా బంగారం 18కే, 22కే, 24కే క్యారెట్స్‌లో లభ్యమవుతుంది.

4. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెడ్(బీఐఎస్)
ప్రభుత్వం బంగారం యొక్క హాల్ మార్కింగ్‌ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండెడ్(బీఐఎస్) ద్వారా ఆమోదిస్తుంది. అంతర్జాతీయ హాల్ మార్కింగ్ విధి విధానాల ద్వారా నిర్ణయిస్తుంది. అనేక బీఐఎస్ సర్టిఫికేట్ నగలు బీఐఎస్ నుండి హాల్ మార్క్ నగలను పొందవచ్చు. భారత్‌లో బంగారం స్వచ్ఛతను నిర్ధారించడానికి సరైన మార్గం ఇదే.

5. తెల్ల బంగారం
ఇక తెల్ల బంగారం అలెర్జీలకు కారణంగా భావిస్తారు. ఐతే ఇది అందరికీ విషయంలో సరైంది కాదు.

6.నగల రసీదులో ఏమేమి కలిగి ఉండాలి?
నగలు కొనుగోలు చేసిన తర్వాత రసీదులో ఉన్న విషయాలను తప్పనిసరిగా సరి చూసుకోవాలి. ఈ రసీదులో బంగారం గురించి తెలిపే క్యారెట్ నాణ్యత మరియు వజ్రాలు లేదా రత్నాల క్యారెట్ నాణ్యతను తెలుపుతుంది.

7. నగలు కొనుగోలు చేసే ముందుగానే నిర్ణయం తీసుకోవాలి
నగలను కొనుగోలు చేయడానికి ముందుగానే ఏమేమి కొనాలనేది నిర్ణయం తీసుకోవాలి. షాపింగ్ వెళ్లిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకోవడం సరైన పద్దతి కాదు.

8. కావాల్సినంత సమయం తీసుకోండి
నగల షాపులో సేల్స్ బాయ్ చెప్పిన దానికి తలుపుతూ బంగారాన్ని కొనేయకండి. మీకు కావాల్సినంత సమయాన్ని తీసుకుని మంచి నగలను కొనుగోలు చేయాలి.
ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లలో బంగారం విలువ బాగా పెరిగింది. బంగారంలో పెట్టుబడులు పెట్టటడం కంటే బంగారు ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయడం మంచిది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications