ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) నుంచి చందాదారులు మరింత సులభంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకునేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాల
ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) నుంచి చందాదారులు మరింత సులభంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకునేలా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో ఆసుపత్రి బిల్లులు చెల్లింపు కోసం ఈపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునే చందాదారులు సెల్ఫ్ డిక్లరేషన్(స్వయం ధ్రువీకరణ) సరిపోతుంది. దాన్ని కార్యాలయంలో అందచేసి విత్‌డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ వెల్లడించింది.

దీనికి సంబంధించి ఈనెల 25న కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం.. ఈపీఎఫ్ చందాదారుడు పనిచేస్తున్న సంస్థ యజమాని సంతకం గానీ, డాక్టర్ సర్ట్ఫికెట్లు గానీ ఇవ్వనక్కర్లేదు. నగదు విత్‌డ్రాకు ఆసుపత్రి బిల్లులపై చందారుడే సంతం చేస్తే సరిపోతుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ప్రారంభించిన సెల్ఫ్ డిక్లరేషన్ విధానానికి అనుగుణంగానే ఈపీఎఫ్ లోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. పీఎఫ్ అడ్వాన్స్ విషయంలోనూ చందాదారుడికి అనేక వెసులుబాట్లు కల్పించినట్టు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ విపి జాయ్ తెలిపారు. కాంపోజిట్ క్లయిం ఫోరం అందజేసి సులభంగా పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

తీవ్రమైన అనారోగ్యానికి గురై కనీసం నెల రోజులు ఆసుపత్రిలో ఉండి ఉంటే ఈపీఎఫ్‌వో ఖాతాలోంచి ఆరు నెలల జీతం విత్‌డ్రా చేసుకోవచ్చు. శస్త్ర చికిత్స లేదా టిబి, కుష్ఠు, పక్షవాతం, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు ఎఎఫ్ సేవింగ్స్ ఖాతాల నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు విత్‌డ్రాలు కొంత ఇబ్బందిగానే ఉండేది. పనిచేస్తున్న కంపెనీ నుంచి, అలాగే వైద్యుడి నుంచి ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రుల బిల్లులపై చందాదారుడు సంతకం ఉంటే సరిపోతుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications