అంద‌రు రైతుల‌ రుణాల మాఫీ మంచిది కాదు

అందరికీ మాఫీ చేసేయడం సరికాదని హర్ష కుమార్ అన్నారు. ప్ర‌తిసారి రైతు రుణ మాపీ ప్ర‌క‌టించిన‌ప్పుడు ప‌న్నుచెల్లింపుదార్ల సొమ్మే దానికి ఉప‌యోగిస్తార‌ని ఆయ‌న వివ‌రించారు.ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.36వేల‌

రైతుల రుణాల మాఫీ సరికాదని, దీంతో నైతికత ప్రమాదంలో పడుతుందని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌)చైర్మన్‌ హర్ష కుమార్ భన్వాలా వ్యాఖ్యానించారు. ఒక్క‌సారిగా అంద‌రు రైతుల‌ రుణ మాఫీ చేయడం కాకుండా.. అవసరమైన వారికి మాత్రమే ఇలాంటి వెసులుబాటు కల్పించవచ్చని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. రుణాల చెల్లింపు కోణం నుంచి చూస్తే రుణ మాఫీలనేవి నైతికతకు ప్రమాదకరమ‌ని చెప్పారు. అందరికీ మాఫీ చేసేయడం సరికాదనిహర్ష కుమార్ అన్నారు. ప్ర‌తిసారి రైతు రుణ మాపీ ప్ర‌క‌టించిన‌ప్పుడు ప‌న్ను చెల్లింపుదార్ల సొమ్మే దానికి ఉప‌యోగిస్తార‌ని ఆయ‌న వివ‌రించారు.ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం రూ.36వేల‌ కోట్ల మేర రైతు రుణ మాఫీ ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

 రైతు రుణాల మాఫీ మంచిది కాదు

ఇదివ‌ర‌కే రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ కూడా ఇటువంటి ప్యాకేజీలపై విముఖత వ్యక్తం చేయటం తెలిసిందే. తమిళనాడు, హరియాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా రుణాల మాఫీ డిమాండ్‌లు వస్తుండటంతో.. ఈ తరహా పథకాల వల్ల తలెత్తే నైతిక సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భన్వాలా చెప్పారు. అవసరమున్న రైతులకు మాత్రమే ఇలాంటి స్కీములను వర్తింపచేయడం మంచిదన్నారు. పన్నుల చెల్లింపుదారుల సొమ్మును రుణాల మాఫీ పథకాలకు మళ్లించడం సరికాదని భన్వాలా అభిప్రాయపడ్డారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+