ఆదాయపు పన్ను వసూళ్లలో బెంగుళూరుది అగ్రస్థానం
పన్ను లక్ష్యాలను చేరుకోవడంలో ముంబయి వెనుకబడటంతో ఆదాయపు పన్ను వసూళ్లలో ఈ ఏడాది బెంగుళూరు టాప్ స్థానానికి చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ జోన్లలో ప్రత్యక్ష పన్ను వ
పన్ను లక్ష్యాలను చేరుకోవడంలో ముంబయి వెనుకబడటంతో ఆదాయపు పన్ను వసూళ్లలో ఈ ఏడాది బెంగుళూరు టాప్ స్థానానికి చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ జోన్లలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎలా ఉన్నాయో ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. ముంబయి పన్ను లక్ష్యం రూ. 2.79 లక్షల కోట్లు కాగా లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక రాజధాని రూ. 2.48 లక్షల కోట్ల మేరకు వసూళ్లు చేయగలిగింది. ముంబయి లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేదన్న ప్రశ్నకు ఒక అధికారి సమాధానమిస్తూ గతేడాది కన్నా రీఫండ్లను 30% పెంచడమే ఇందుకు కారణం కావొచ్చని చెప్పారు.

దేశవ్యాప్తంగా చూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇలా ఉన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 14.2% పెరుగుదలతో 8.47 లక్షల కోట్ల రూపాయల వసూళ్లు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మెట్రో నగరాల్లో బెంగుళూరు అన్నిటికంటే ముందంజలో ఉందని అధికారులు తెలిపారు. శాతాల వారీగా చూస్తే 21% పెరుగుదలతో రూ. 90 వేల కోట్లను బెంగుళూరు ఆర్జించగలిగింది. దేశ రాజధాని ఢిల్లీ మాత్రం కేవలం 5% మాత్రమే పన్ను వసూళ్లలో పురోగతిని కనబరిచింది. మరో వైపు దక్షిణ భారతదేశంలోని మరో ప్రముఖ నగరం చెన్నై 18% వృద్ది చెంది రూ.60 వేల కోట్ల లక్ష్యాన్ని సాధించింది. కోల్‌కత పన్ను వసూళ్లు 15% పెరిగి రూ.36500 కోట్లను చేరినట్లు అధికారి తెలిపారు.
More From GoodReturns

కర్ణాటకను వదిలేస్తున్న కంపెనీలు… గత ఐదు సంవత్సరాల్లో 629 కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వలస..

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications