‘డేటా జాక్‌పాట్’ ఆఫర్‌తో పోస్ట్‌పెయిడ్ వాళ్లకు బంపర్ ఆఫరిచ్చిన ఐడియా
రూ. 100తో 10 జీబీ వరకూ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.100 నామ మాత్రపు ధరకే మూడు నెలల పాటు ప్రతినెలా 10 జీబీ వరకూ డేటా అందిస్తామని చెప్పింది. ఈ ఆఫర్‌ను ఎంచుకున్న వారికి కనీసం
జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ నిలిపేయాలంటూ ట్రాయ్ రిలయన్స్‌కు షాకిస్తే.. ఐడియా సెల్యూలార్ మాత్రం.. 'డేటా జాక్‌పాట్' ఆఫర్‌తో కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రయత్నం చేస్తోంది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన ఈ ప్లాన్ ప్రకారం.. రూ. 100తో 10 జీబీ వరకూ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.100 నామ మాత్రపు ధరకే మూడు నెలల పాటు ప్రతినెలా 10 జీబీ వరకూ డేటా అందిస్తామని చెప్పింది. ఈ ఆఫర్‌ను ఎంచుకున్న వారికి కనీసం 1 జీబీ డేటా అయినా అందించనున్నట్లు తెలిపింది. మూడు నెలల తర్వాత కూడా నెలకు 1 జీబీ చొప్పున డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు ఐడియా వెల్లడించింది.

మై ఐడియా యాప్ ద్వారా ఈ ఆఫర్ అందుబాటులోకి ఉంటుంది. ఏప్రిల్ 30 వరకూ అందుబాటులో ఉండే ఆఫర్ ఎంచుకునేందుకు కస్టమర్లు కనీసం రూ.199 ప్లాన్, లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ప్లాన్లను ఎంచుకోవాలి. ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్ లాంటి ఇతర టెలీకాం సంస్థలు కూడా ప్రత్యేక డేటా ఆఫర్‌ను అందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రిపెయిడ్ కస్టమర్ల కోసం ఐడియా రూ. 348 ప్లాన్‌లో (సర్కిల్‌ను బట్టి మారే అవకాశం) అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకూ రోజుకు 500 ఎంబీ చొప్పున డేటా వాడుకునే వీలుండగా.. దాన్ని 1 జీబీకి పెంచింది. ఈ ప్లాన్ 4జీ హ్యాండ్‌సెట్లు వాడే కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications