రిటైల్ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఆదరణ వేగంగా పెరుగుతున్న సంగతి సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే మార్కెట్లో ఉన్నవారు కొత్త పథకాలను కొనుగోలు చేయడంతో పాటు కొత్తగా మొదటిసారి మ్యూచువల
ఒకప్పుడు సంప్రదాయ పెట్టుబడుల నుంచి మార్కెట్ పెట్టుబడుల వైపు వెళ్లేందుకు ప్రభుత్వం ఎంతో చేయాల్సి వచ్చేది. పెరుగుతున్న అవగాహనతో సాధారణ పెట్టుబడిదారులు సైతం స్టాక్ మార్కెట్, దాని ఆధారిత పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫండ్ సంస్థలు ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాలే దీనికి నిదర్శనం. ఇంకా చూస్తే రిటైల్ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఆదరణ వేగంగా పెరుగుతున్న సంగతి సంతోషించాల్సిన విషయం. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఉన్నవారు కొత్త పథకాలను కొనుగోలు చేయడంతో పాటు కొత్తగా మొదటిసారి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య సైతం పెరుగుతోంది. దీనికి సంబంధించి గతేడాది జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

నికరంగా 67.25 లక్షల ఫోలియోల పెరుగుదల
మార్చితో ముగిసిన క్రితం ఆర్థిక సంవత్సరం(2016-17)లోని మొదటి 11 నెలల్లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో నికరంగా 67 లక్షల కొత్త ఫోలియోలు (ఇన్వెస్టర్లకు కేటాయించే నంబర్) తోడయ్యాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల ఫోలియోలు 5.4 కోట్లకు వృద్ధి చెందడం విశేషం. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనూ ఇలా కొత్తగా వచ్చి చేరిన వారి సంఖ్య 59 లక్షలు. చివరి రెండు సంవత్సరాల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో చేరిన కొత్త ఖాతాదారుల్లో ఎక్కువ మంది చిన్న పట్టణాల నుంచే ఉండడం పెరుగుతున్న అవగాహనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

4 కోట్లను చేరిన రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోలు
మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ప్రకారం... 43 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో మొత్తం ఫోలియోల సంఖ్య 2016 మార్చి నాటికి 4,76,63,024గా ఉండగా, ఆ సంఖ్య 2017 ఫిబ్రవరి నాటికి 5,43,87,930కు పెరిగింది. దీంతో నికరంగా పెరిగిన ఫోలియోలు 67.25 లక్షలు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిథ్యం పెరగడం, అందులోనూ చిన్న పట్టణాల నుంచి అధికంగా ఉండడం, ఈక్విటీ పథకాల్లోకి భారీగా పెట్టుబడుల రాక వృద్ధికి చోదకాలుగా ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2016 ఏప్రిల్ నుంచి 2017 ఫిబ్రవరి వరకు కొత్తగా చేరిన 67.25 లక్షల ఫోలియోల్లో రిటైల్ ఇన్వెస్టర్లవి 40 లక్షలకు పైనే ఉన్నాయి. దీంతో మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల ఫోలియోలు 4 కోట్లను చేరినట్టు లెక్క.

ఫోలియో నంబర్
ఫోలియో అంటే నియంత్రణ సంస్థ ఇన్వెస్టర్లకు కేటాయించే ఓ గుర్తింపు నంబర్.దీని ఆధారంగా పెట్టుబడులు కొనసాగుతాయి.
ఒక్కో ఇన్వెస్టర్‌కు ఎన్ని ఫోలియోలు అయినా ఉండొచ్చు. కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్‌మెంట్లో మీరు మీ ఫోలియో నంబరును తెలుసుకోవచ్చు.

పెరుగుతున్న అవగాహన
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి చెప్పుకోదగ్గ డిమాండ్‌తో ఆర్థిక సంవత్సరం మొదటి పదకొండు నెలల్లో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు, ఫోలియోలు రికార్డులను సృష్టిస్తున్నాయి. సాధారణంగా ఎఫ్‌డీల కంటే ఎక్కువ రాబడులు కావాలనే కొంచెం అవగాహన కలిగిన ఇన్వెస్టర్లు కోరుకుంటారు. అయితే నష్టభయం కారణంగా మార్కెట్ పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడతారు. అలాంటి వారికి ఫండ్లు సరైన మార్గం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications