English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

సైన్యం ప‌రంగా 10 శ‌క్తిమంత‌మైన దేశాలు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

జ‌నాభా, ర‌క్ష‌ణ బ‌డ్జెట్‌, సైన్యం, యుద్ద ట్యాంకులు, వాయు ద‌ళం, జ‌లాంత‌ర్గాముల ప‌రంగా ప్ర‌పంచంలోనే మిలిట‌రీ ప‌రంగా శ‌క్తిమంత‌మైన దేశాల‌ను నిర్ణ‌యిస్తారు. మ‌ధ్య ఆసియాలో కొన్ని దేశాలు, సిరియా సంక్షోభం, దక్షిణ‌,ఉత్త‌ర కొరియాలు నిరంత‌రం కాలు దువ్వుకోవ‌డం వంటి వాటిని చూస్తే అప్పుడప్పుడు యుద్ద మేఘాలు క‌మ్ముకున్న‌ట్లుగా ఉంటుంది. దీని కోస‌మే అన్ని దేశాలు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ సైనిక శ‌క్తిని ప‌రీక్షించుకుంటున్నాయి. ఉత్త‌ర కొరియా అయితే ఏకంగా అణు ప‌రీక్ష‌ల‌కు సైతం వెనుకాడ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ప్రపంచంలో వివిధ దేశాలు ర‌క్ష‌ణ బ‌డ్జెట్ కోసం ఏ మేర‌కు కేటాయింపులు చేస్తున్నాయి, ఎంత మేర‌కు సైనిక శ‌క్తిని క‌లిగి ఉన్నాయో తెలుసుకోవాల‌ని ఉంటుంది. అందుకోస‌మే ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన 10 దేశాల జాబితాను క్రోడీక‌రించాం. ఆ వివ‌రాలు మీ కోసం....

1.అమెరికా

1.అమెరికా

జ‌నాభా: 32 కోట్ల‌కు పైగా

బ‌డ్జెట్ : 601 బిలియ‌న్ డాల‌ర్లు

క్రియాశీల‌క సైన్యం : 14,00,000 ట్రూప్‌లు

ట్యాంకులు: 8848

విమాన బ‌లం: 13,892

జ‌లాంత‌ర్గాములు:

అమెరికా వాయు ద‌ళంలో దాదాపు 14 వేల ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 2207 ఇంట‌ర్‌సెప్టార్లు, 2797 ఫిక్స్‌డ్ వింగ్‌లు, 5366 కార్గో విమానాలు, 6196 హెలికాప్ట‌ర్లు, 920 గ‌న్‌షిప్ హెలికాప్ట‌ర్ల‌ను త‌న సైన్యంలో భాగం చేసుకుంది.

ఇంకా నావికా ద‌ళం 62 విధ్వంస‌క క్షిప‌ణులు, 72 జ‌లాంత‌ర్గాములు, 13

డిఫెన్సివ్ క్రాఫ్ట్‌లు, 10 ఫ్రైగేట్లు, 11 మైన్ వార్‌ఫేర్ ఆర్సెనెల్స్‌ను క‌లిగి ఉంది.

2. ర‌ష్యా

2. ర‌ష్యా

జ‌నాభా: 14 కోట్ల 24 ల‌క్ష‌లు

బ‌డ్జెట్ : 84.5 బిలియ‌న్ డాల‌ర్లు

క్రియాశీల‌క సైన్యం : 13,55,000

ట్యాంకులు: 15,398

విమాన బ‌లం: 3,547

జ‌లాంత‌ర్గాములు:55

సోవియ‌ట్ యూనియ‌న్ ప‌త‌నానికి ముందు ప్ర‌పంచంలోనే అతి శ‌క్తిమంత‌మైన దేశంగా ర‌ష్యా ఉండేది. ప్ర‌స్తుతం అమెరికా త‌ర్వాత యుద్ద సామాగ్రిని అమ్మ‌డంలో రెండో అతిపెద్ద డీల‌రుగా ఈ దేశం వ్య‌వ‌హ‌రిస్తోంది. ర‌ష్యా వ్యూహాత్మ‌కంగా యాంటీ యూర‌ప్‌, యాంటీ అమెరికా, యాంటీ ఇజ్రాయెల్‌, యాంటీ మిడిల్ ఈస్ట్‌(సిరియా తప్ప‌) కావ‌డం మూలంగా ర‌క్ష‌ణ‌, మిలిట‌రీ సామ‌ర్థ్యాన్ని ఎంతో త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రంగా నిర్వ‌హించాల్సి వ‌స్తోంది.

3. చైనా

3. చైనా

జ‌నాభా: 13.67 కోట్లు

బ‌డ్జెట్ : 216 బిలియ‌న్ డాల‌ర్లు

క్రియాశీల‌క సైన్యం: 23,35,000

ట్యాంకులు: 9,150

విమాన బ‌లం: 2,942

జ‌లాంత‌ర్గాములు: 67

 4. భార‌త్

4. భార‌త్

జ‌నాభా: 125 కోట్లు

బ‌డ్జెట్ : 2,74,114 కోట్లు

క్రియాశీల‌క సైన్యం: 13,25,000

ట్యాంకులు: 6,464

విమాన బ‌లం: 2,086

జ‌లాంత‌ర్గాములు: 15

అణ్వాయుధాల‌కు సంబంధించి త‌న శ‌క్తిని మెరుగుప‌రుచుకునేందుకు భార‌త్ ఇప్పుడిప్పుడే త‌న శ‌క్తినంతా కూడ‌దీసుకుంటోంది. ఒక‌వైపు దాయాది పాకిస్తాన్ కుటిల తీవ్ర‌వాద తంత్రాల‌ను తిప్పికొడుతూ, మ‌రో వైపు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ద్ద నిరంత‌రం చొర‌బాట్లకు పురికొల్పుతున్న చైనాను అడ్డుకునేందుకు భార‌త్ నిరంత‌రంగా శ్ర‌మిస్తోంది. సైనిక బ‌లగం ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా నాలుగోస్థానంలో భార‌త్ ఉంది.

5. యునైటెడ్ కింగ్‌డ‌మ్

5. యునైటెడ్ కింగ్‌డ‌మ్

జ‌నాభా: 6,40,88,222

బ‌డ్జెట్‌: 60.5 బిలియ‌న్ డాల‌ర్లు

క్రియాశీల‌క సైన్యం: 1,46,980

ట్యాంకులు: 407

విమాన బ‌లం: 936

జ‌లాంత‌ర్గాములు: 10

6. ఫ్రాన్స్

6. ఫ్రాన్స్

జ‌నాభా: 66,553,766

బ‌డ్జెట్‌: 58.24 బిలియ‌న్ డాల‌ర్లు

క్రియాశీల‌క సైన్యం: 3,62,485

ట్యాంకులు: 423

విమాన బ‌లం: 1264

జ‌లాంత‌ర్గాములు: 10

7. ద‌క్షిణ కొరియా

7. ద‌క్షిణ కొరియా

జ‌నాభా: 4,91,15,196

బ‌డ్జెట్‌: 28 బిలియ‌న్ డాల‌ర్లు

క్రియాశీల‌క సైన్యం: 6,53,000

ట్యాంకులు: 2381

విమాన బ‌లం: 1451

నౌకా సామ‌ర్థ్యం: 166

జ‌లాంత‌ర్గాములు: 13

8. జ‌పాన్‌

8. జ‌పాన్‌

జ‌నాభా: 12 కోట్ల 70 లక్ష‌లు

బ‌డ్జెట్‌: 41.6 బిలియ‌న్ డాల‌ర్లు

క్రియాశీల‌క సైన్యం: 2,47,173

ట్యాంకులు: 678

విమాన బ‌లం: 1613

జ‌లాంత‌ర్గాములు: 16

రెండో ప్ర‌పంచ యుద్ద స‌మ‌యంలో అణు ఆయుధాల వ‌ల్ల చితికిపోయిన దేశ‌మిది. ఆయా గాయాల నుంచి కోలుకునేందుకు ప్ర‌తి జ‌ప‌నీయుడు క‌ష్ట‌ప‌డి శ్రమించారు. ప్ర‌స్తుతం సాంకేతిక‌త‌లో కానీ త‌యారీ రంగంలో కానీ త‌మ‌కంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్నారు. మ‌న ఇళ్ల‌లో వాడే ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌లో ఏదో ఒక‌టి జపాన్ దేశానికి చెందిన‌ది ఉండేంత‌గా వారు ఎల‌క్ట్రానిక్ అండ్ హార్డ్‌వేర్ రంగంలో పాతుకుపోయారు.

9. ఇట‌లీ

9. ఇట‌లీ

జ‌నాభా: 5.983 కోట్లు

బ‌డ్జెట్‌: 31.94 బిలియ‌న్ డాల‌ర్లు (2010లొ 35.8 బిలియ‌న్ డాల‌ర్లు)

క్రియాశీల‌క సైన్యం: 2,93,202

ట్యాంకులు: 586

విమాన బ‌లం: 785

జ‌లాంత‌ర్గాములు: 6

10. జ‌ర్మ‌నీ

10. జ‌ర్మ‌నీ

జ‌నాభా: 8,21,75,700

బ‌డ్జెట్‌: 32.9 బిలియ‌న్ డాల‌ర్లు(2015)

క్రియాశీల‌క సైన్యం: 1,78,000

ట్యాంకులు: 408

విమాన బ‌లం: 676

జ‌లాంత‌ర్గాములు: 8

Read more about: military, defence, india
English summary

worlds 10 most powerful militaries

10 Most Powerful Militaries in The World The folks at Global Firepower ranked the world’s 10 most powerful militaries. They examined the defence forces of 68 countries in order to compile the rankings, taking into account manpower, land systems, air power, naval power, resources, logistics, finances and geography covered. India is spending 274000 crore on defence in the year 2017-18.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC