For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్ల ర‌ద్దు త‌ర్వాత యూపీఐ ద్వారా డిజిట‌ల్ లావాదేవీలు 584% అప్‌

100 న‌గ‌రాల్లో డిజిధ‌న్ మేళాల‌ను నిర్వ‌హించారు. త‌ద్వారా 5వేల ఆర్థిక సంస్థ‌లు 15 లక్ష‌ల ఖాతాదార్ల‌ను చేరుకోగ‌లిగిన‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా 16వేల ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు సంస్థ‌లు న‌గ‌దు ర‌హితంగా ప్

|

నోట్ల రద్దు జ‌రిగిన త‌ర్వాత నుంచి యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌) ద్వారా జ‌రిగిన డిజిట‌ల్ లావాదేవీల విలువ 584 శాతం పెరిగిన‌ట్లు ఒక అధికారి గురువారం వెల్ల‌డించారు. ఇదే కాలంలో ఆధార్ ఆధారిత చెల్లింపులు సైతం చెప్పుకోద‌గ్గ విధంగా 1352%(0.7 మిలియ‌న్ల నుంచి 2.7 మిల‌య‌న్ల‌కు) పెరిగాయ‌ని నీతి ఆయోగ్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది. న‌ల్ల‌ధ‌నం, స‌మాంత‌ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా జ‌రిగే చెల్లింపుల‌ను 25 బిలియ‌న్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. యూపీఐ-ప‌లు ముఖ్యాంశాలు

 నోట్ల ర‌ద్దు త‌ర్వాత యూపీఐ ద్వారా డిజిట‌ల్ లావాదేవీలు 584% అప్‌

డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్రోత్సాహ‌కాల గురించి సైతం వివ‌రించారు. 14 ల‌క్ష‌ల‌కు పైగా వినియోగ‌దారులు, 77వేల వ్యాపారుల‌కు రూ.226 కోట్ల మేర ప్రోత్సాహ‌కాల‌ను అందించిన‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు ల‌క్కీ గ్రాహ‌క్ యోజ‌న‌, డిజిధ‌న్ వ్యాపార్ యోజ‌న‌ల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 100 న‌గ‌రాల్లో డిజిధ‌న్ మేళాల‌ను నిర్వ‌హించారు. త‌ద్వారా 5వేల ఆర్థిక సంస్థ‌లు 15 లక్ష‌ల ఖాతాదార్ల‌ను చేరుకోగ‌లిగిన‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగా 16వేల ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు సంస్థ‌లు న‌గ‌దు ర‌హితంగా ప్ర‌క‌టించుకున్నాయి. 100 రోజుల డ‌జిధ‌న్ మేళాలు ఏప్రిల్ 14న మెగా డ్రాతో ముగుస్తాయి. డిజిట‌ల్ చెల్లింపుల‌కు ప్ర‌భుత్వం న‌జ‌రానాలు: ల‌క్కీ విజేత‌కు రూ. కోటి

Read more about: digital payments cashless
English summary

నోట్ల ర‌ద్దు త‌ర్వాత యూపీఐ ద్వారా డిజిట‌ల్ లావాదేవీలు 584% అప్‌ | digital transactions via UPI app rised 584 percent after demonetisation

"There has been a phenomenal 584 per cent increase (0.3 to 4.5 million) in transactions made through the Unified Payments Interface (UPI) since demonetisation. In the same period, payments using Aadhaar have also seen an unprecedented jump of 1352 per cent (0.7 to 2.7 million)," a NITI Aayog press release said.
Story first published: Friday, March 31, 2017, 17:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X