మొబైల్ టెలికం దిగ్గజాలు వొడాఫోన్- ఐడియా సెల్యులర్ విలీనం అధికారికంగా ఖరారయ్యింది. ఇందుకోసం ఆదిత్యా బిర్లా గ్రూప్, వోడాఫోన్ గ్రూప్‌లు తమ ఆమోదం తెలిపాయి. విలీనం తర్వాత దేశంలోనే అత్యధిక వినియోగదార
మొబైల్ టెలికం దిగ్గజాలు వొడాఫోన్- ఐడియా సెల్యులర్ విలీనం అధికారికంగా ఖరారయ్యింది. ఇందుకోసం ఆదిత్యా బిర్లా గ్రూప్, వోడాఫోన్ గ్రూప్‌లు తమ ఆమోదం తెలిపాయి. విలీనం తర్వాత దేశంలోనే అత్యధిక వినియోగదారులు కలిగిన టెలికాం కంపెనీ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వాడకం దారుల సంఖ్య పరంగా వోడాఫోన్, ఐడియా రెండు,మూడు స్థానాల్లో ఉండగా ఎయిర్టెల్ ప్రథమ స్థానంలో ఉంది.

ఒక్కో షేర్‌కి రూ. 72 ధరలో వొడాఫోన్‌తో ఐడియా సెల్యులర్ విలీన డీల్ కుదిరినట్లు వెల్లడైంది. తద్వారా ప్రస్తుత ఐడియా ప్రమోటర్లు ఆదిత్య బిర్లా(ఏబీ) గ్రూప్‌నకు 21.1 శాతం వాటా లభించనుంది. దీనికి అదనంగా 4.9 శాతం వాటాను ప్రస్తుత ధర వద్ద ఏబీ గ్రూప్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏబీ గ్రూప్ ప్రమోటర్ల వాటా విలీన సంస్థలో 26 శాతానికి చేరనుంది.
మొత్తానికి నూతన సంస్థలో వాటాలు ఈ విధంగా ఉండనున్నాయి. వోడాఫోన్ ఇండియా-45.1%, ఐడియా ప్రమోటర్ల చేతిలో-26%; మిగిలిన 28.9% పబ్లిక్ చేతిలో ఉంటుంది.

ఈ వార్తల నేపథ్యంలో ఐడియా కౌంటర్లో ప్రస్తుతం అమ్మకాలకు తెరలేచింది. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్‌లో 2.38 గం.ల సమయానికి ఐడియా షేరు దాదాపు 85 నష్టపోయి 99.40 వద్ద ట్రేడవుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications