ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగి దాచుకున్న డబ్బును పింఛను రూపంలో వెనక్కు తీసుకునేందుకు ఆధార్ తప్పనిసరేం కాదని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్
ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగి దాచుకున్న డబ్బును పింఛను రూపంలో వెనక్కు తీసుకునేందుకు ఆధార్ తప్పనిసరేం కాదని ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు ఫిబ్రవరి 27న తన ప్రాంతీయ కార్యాలయాలకు ఒక లేఖను పంపించింది. అందులో ప్రస్తుతానికి పింఛను(10డీ) క్లెయింలకు మాత్రమే ఆధార్ తప్పనిసరని పేర్కొంటూ; 10సీ ఉపయోగించి చేసే విత్‌డ్రాయల్స్‌కు ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది. ఇది కూడా చదవండి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?
గతవారంలో పీఎఫ్ విత్‌డ్రా చేసే ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌వో పలు ఉపశమన చర్యలను తీసుకున్న సంగతి తెలిసిందే. ఉద్యోగం కల్పించిన సంస్థ అటెస్టేషన్ తప్పనిసరిగా అవసరం లేదని పేర్కొంటూనే విత్‌డ్రాయల్ ఫారంను ఒకే పేజీకి కుదించారు. దీంతో యూఏఎన్‌కు బ్యాంకు ఖాతా, ఆధార్ అనుసంధానం అయి ఉంటే నేరుగా పీఎఫ్ కార్యాలయానికి విత్‌డ్రాయల్ దరఖాస్తును పంపవచ్చు. ఆన్‌లైన్‌లో సైతం పీఎఫ్ విత్‌డ్రాయల్ ఫారంను సమర్పించే సదుపాయాన్ని కల్పించారు.