పెద్దనోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తాల్లో జరిగిన డిపాజిట్లపై ఆదా యం పన్ను విభాగం దృష్టి సారించింది. ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో దూకుడుగా ముందుకెళుతోంది. గత కొన్ని వారాలుగా ఈ డిపాజిట్ల తీరుతెన్నులను పరిమా
పెద్దనోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తాల్లో జరిగిన డిపాజిట్లపై ఆదా యం పన్ను విభాగం దృష్టి సారించింది. ఆపరేషన్ క్లీన్ మనీ పేరుతో దూకుడుగా ముందుకెళుతోంది. గత కొన్ని వారాలుగా ఈ డిపాజిట్ల తీరుతెన్నులను పరిమాణాన్ని లోతు గా విశ్లేషించిన ఐటీ విభాగం మొత్తం 9 లక్షల ఖాతాలు అనుమానాస్పదమైనవేనని వెల్లడించింది. వీరికి నోటీసులు జారీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అయితే మార్చి 31తో ముగిసే కొత్త పథకం(గరీబ్ కల్యాణ్ యోజన) గడువు అనంతరం ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

'ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట ఈ ఖాతాలను ఐటి విభాగం విశ్లేషించింది. ఇప్పటికే 18 లక్షల మందికి ఎస్సెమ్మెస్లు, ఇమెయిల్స్ పంపించామని, వారిచ్చిన వివరాలను కూలంకషంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. 50 రోజుల గడువులో ఐదు లక్షలకు పైగా బ్యాంకుల్లో జరిగిన డిపాజిట్లపై దృష్టిపెట్టామని తెలిపింది. వీరందరినీ ఇంత మొత్తం ఎక్కడినుంచి వచ్చిందీ, అందుకు వారికున్న ఆదాయ మార్గాలేమిటని ప్రశ్నించినట్లు వెల్లడించింది. వీరంతా ఈ నెల 15లోగా సమాధానం ఇవ్వాలని కూడా స్పష్టం చేశామని తెలిపింది. అయితే కొంత మంది దీనిపై స్పందించలేదు.

ఇప్పటికే ఈ గడువు ముగిసింది కాబట్టి ఐటీ ప్రశ్నలకు వీరంతా న్యాయబద్ధమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. చట్టపరంగా వారి దగ్గర ఏవో వివరణలిచ్చే సమాచారం ఉండబట్టే ఇలా చేస్తుండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పన్ను రిటర్న్స్లో వీటిని చూపించినంత మాత్రాన సరిపోదని, 2016-17 సంవత్సరంలో వీరికున్న ఆదాయాన్ని అంతకు ముందు సంవత్సరాల్లో వీరు సంపాదించిన మొత్తాన్ని బేరీజు వేసే అసలు వాస్తవం వెల్లడవుతుందని ఐటి వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం తేడాలున్నా ఆ మొత్తాన్ని లెక్కల్లో మొత్తంగానే పరిగణిస్తామని తెలిపాయి. ఇప్పటికే ప్రశ్నలను అందుకున్న 18లక్షల మందిలో 5.27 లక్షల మంది సమాధానం చెప్పారని, వీరంతా తాము నగదును డిపాజిట్ చేసిన విషయాన్ని కూడా ధ్రువీకరించారని తెలిపాయి. దేశవ్యాప్తంగా 7.41లక్షల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు డిపాజిట్ అయింది. తాము ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పకపోయినా, ఇతరత్రా తమ అక్రమార్జనను సక్రమంగా మార్చుకునేందుకు ప్రయత్నించినా అలాంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఐటి శాఖ తెలిపింది.
More From GoodReturns

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!



Click it and Unblock the Notifications