ప్రేమికుల రోజు సందర్భంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ (సియా) భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ప్రయాణికులను ఆకర్షించే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 899 రూపాయల ప్రారంభ ధ
ప్రేమికుల రోజు సందర్భంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ (సియా) భాగస్వామ్యంలో ఏర్పాటైన ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా ప్రయాణికులను ఆకర్షించే సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 899 రూపాయల ప్రారంభ ధరతోనే వివిధ గమ్యస్థానాలకు ఎకానమీ టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇంకా ఆ సంస్థ అందించిన పలు ఆఫర్ల విశేషాలను తెలుసుకుందాం.

ఒకవైపు ప్రయాణ ధర రూ. 899కే
వాలెంటైన్స్ డే సందర్భంగా అయిదురోజుల ప్రత్యేక వాలెంటైన్స్ డే అమ్మకాలకు తెరతీసింది. ఈ తగ్గింపు ధరలను సోమవారం ప్రకటించింది. రూ. 899 ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎకానమీ క్లాస్ లో ఒక మార్గం ప్రయాణానికి గాను అన్నీ కలిపి ఈ తగ్గింపు ధరలను ప్రవేశపెట్టింది.

ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ
టిక్కెట్ల అమ్మకాలు సోమవారం ఫిబ్రవరి 13, 2017 ప్రారంభం. శుక్రవారం ఫిబ్రవరి 17 అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 28, 2017 సెప్టెంబర్ 20, 2017 మధ్య చేసే ప్రయాణాలకు ఇది వీలు కల్పిస్తుంది.

బిజినెస్ క్లాస్‌లో 40% రాయితీ
అలాగే బిజినెస్ క్లాస్ లో 60శాతం ప్రత్యేక రాయితీ, ప్రీమియం ఎకానమీలో 40శాతం వరకు రాయితీని వినియోగదారులకు అందిస్తోంది. దేశం లోపల 20ప్రదేశాలకు ప్రయాణించేందుకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని విస్తారా ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కొత్తగా ప్రారంభించిన పోర్ట్ బ్లెయిర్ (అండమాన్), అమృత్‌సర్, లేహ్ (లడఖ్) సహా, నూతనంగా మొదలుపెట్టిన కోలకతా-పుణే మార్గంలో కూడా ఈ ఆఫర్‌ను వర్తింపచేయనున్నట్టు విస్తారా ప్రకటించింది.
ఇది కూడా చదవండి క్రమమైన ఆదాయానికి 10 రకాల పెట్టుబడులు

ఎకానమీ టిక్కెట్ల ధరలు ఇలా...
గౌహతి-బాగ్‌డోగ్రా మధ్య రూ.899, గోవా-ముంబయి రూ. 1499, ఢిల్లీ-అమ్రిత్‌సర్ రూ. 1549, ఢిల్లీ-పుణె రూ. 2399, ఢిల్లీ-గోవా రూ.3299 ధరల్లో ఎకానమీ ప్రయాణ టిక్కెట్లు లభ్యమవుతాయని ఎయిర్‌లైన్స్ సంస్థ వెల్లడించింది. వీటితో పాటు క్లబ్ విస్తారా సభ్యులు తమ టిక్కెట్లను airvistara.com ద్వారా బుక్ చేసుకుంటే అదనంగా 10% రాయితీ పొందవచ్చని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి హెచ్ 1 వీసా బిల్లేంటో... దేశ ఐటీ కంపెనీల గుబులేంటో


Click it and Unblock the Notifications