ఆర్‌బీఐకి ఇదో ఆరవ ద్వైమాసిక సమీక్ష కేంద్ర బ్యాంకు నిర్ణయంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.3.02 గం.ల సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు కోల్పోయి 28225 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ20
నోట్ల రద్దు తర్వాత డిమాండ్ తగ్గడంతో మళ్లీ దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఎంతో మంది ఆశలపై ఆర్‌బీఐ నీళ్లు చల్లింది. ఈ రోజు జరిగిన ద్రవ్య పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) నిర్వహించిన పరపతి సమీక్షలో యథాతథ పాలసీనే అమలు చేయాలని తీర్మానించింది. దీంతో రెపో 6.25 శాతం వద్దే కొనసాగనుంది. ఆర్‌బీఐకి ఇదో ఆరవ ద్వైమాసిక సమీక్ష. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు. జనవరి 27 నాటికి చలామణీలో ఉన్న నోట్ల విలువ 9.91 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ గాంధీ తెలిపారు. ఇది కూడా చదవండి ముద్రా రుణాల గురించిన ముఖ్య విషయాలు ఇవే...
ఫిబ్రవరి 20 నుంచి పొదుపు ఖాతాల్లో నుంచి విత్‌డ్రా చేసుకునే సొమ్ము పరిమితిని వారానికి రూ. 50 వేలకు పెంచుతున్నట్లు వెల్లడించారు.
కేంద్ర బ్యాంకు నిర్ణయంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 3.02 గం.ల సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు కోల్పోయి 28225 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 20 పాయింట్లు కోల్పోయి 8748 వద్ద కొనసాగుతోంది.

More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications