పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ.71.47 కోట్లుగా ప్రభుత్వం లెక్క తేల్చింది.ప్రథమ స్థానంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ద్వారా 46.29 కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన
నాయకుడు ఒక బృహత్తర కార్యక్రమం తలపెడితే ప్రజలు దానికి సహకరించాలి. అతని చర్యలను మద్దతు పలకాలి. దేశంలో మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మనసారా స్వాగతించారు కోట్ల మంది. అయితే అసలు ఎక్కడ పనిజరగాలో అక్కడే బెడిసికొట్టింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ.. నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ ప్రక్రియలో బ్యాంకు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు బ్యాంకర్ల అక్రమాలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటనను వెలువరించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల ఉద్యోగులు చేసిన అక్రమాల విలువ రూ.71.47 కోట్లుగా ప్రభుత్వం లెక్క తేల్చింది.ప్రథమ స్థానంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ద్వారా 46.29 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అది కూడా కేవలం మూడు శాఖల ద్వారానే కావడం విశేషం. అమ్మో! నల్లధనాన్ని ఈ విధంగా మార్చేశారంట

డీమానిటైజేషన్ సమయంలో అంటే.. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు... వీరు నగదు మార్పిడిలో పలు అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని కేంద్రం తెలిపింది. రద్దయిన నోట్ల అక్రమ మార్పిడి, అక్రమ లావాదేవీల్లో పలు బ్యాంకులకు చెందిన 14 బ్రాంచ్‌లలో ఈ అక్రమాలను గుర్తించినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గాంగ్వర్ తెలిపారు. ఆర్బీఐ సైతం పెద్ద మొత్తంలో ఆ సమయంలో జరిగిన నగదు లావాదేవీలను ట్రాక్ చేసింది. అంతే కాకుండా వాటి వివరాలను సమర్పించాలని బ్యాంకులను సైతం ఆదేశించింది. సో! అక్రమార్కులారా సిద్దంగా ఉండండి.. ప్రభుత్వం మీ భరతం పట్టబోతోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications