బంగారం ధర వరుసగా రెండో రోజూ క్షీణించింది. 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గి రూ.29,150గా పలుకుతోంది. డిమాండ్ తక్కువ ఉన్న కారణంగా వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవటంతో ధర పడిపోయింది. ఇదే బాటలో వెండ
బంగారం ధర వరుసగా రెండో రోజూ క్షీణించింది. 10 గ్రాముల బంగారం రూ.400 తగ్గి రూ.29,150గా పలుకుతోంది. డిమాండ్ తక్కువ ఉన్న కారణంగా వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవటంతో ధర పడిపోయింది. ఇదే బాటలో వెండి కూడా తగ్గుముఖం పట్టి రూ.41,000 దిగువకు పడింది. కేజీ వెండి ధర రూ.550 తగ్గి రూ.40,950కి చేరింది.
నాణేల తయారీదారుల నుంచి డిమాండు లేకపోవటంతో వెండి ధర దిగి వచ్చినట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.37శాతం తగ్గి 1,183 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం తగ్గి 16.70 డాలర్లుగా ఉంది.