బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. మరో వైపు వ్యక్తుల వద్ద ఉండే బంగారం నిల్వలపైన ప్రభుత్వ పరిమితులు విధిస్తుందనే పుకార్లు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పలు ప్రశ్
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. మరో వైపు వ్యక్తుల వద్ద ఉండే బంగారం నిల్వలపైన ప్రభుత్వ పరిమితులు విధిస్తుందనే పుకార్లు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెట్టినవారు, భవిష్యత్తులో కొనాలనుకునేవారు పలు సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. ఆయా నిబంధనల మూలంగా బంగారం కొనాలా? వద్దా? అయితే ప్రత్యామ్నాయాలేంటి? ఇలాంటి పలు ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు తెలుసుకుందాం.

ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో సమీప భవిష్యత్తులో బంగారం రేట్లు తగ్గనున్నాయి. ఇంకా వడ్డీ రేట్లను క్రమంగా తగ్గించనున్నట్లు ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎల్లెన్ అన్నారు. దీంతో బంగారం మరింత తగ్గుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డిమాండ్ సైతం తగ్గుతోంది
ప్రపంచవ్యాప్తంగా బంగారం వినియోగంలో సింహ భాగం భారత్, చైనా దేశాల నుంచే జరుగుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధరలు మారడంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గత కొద్ది నెలలుగా ఈ రెండు దేశాల్లో వినియోగం తగ్గుతోంది. ఆర్థిక పరిస్థితులు అంత ఆశాజనకంగా లేకపోవడంతో బంగారం తదితర సాధనాల్లో పెట్టుబడి దిశగా కొనుగోళ్లు జరిపేవారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ పథకమైన ఎస్‌పీడీఆర్ నుంచి గత నెల రోజులుగా ఇన్వెస్టర్లు 75 టన్నుల బంగారానికి సమానమైన పెట్టుబడులను వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో అన్ని రకాల బంగారం కొనుగోళ్లు బాగా పడిపోయాయి. దీంతో ఈ సంవత్సరం దేశ బంగారు దిగుమతులు 500 టన్నులు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పసిడి ధరలు ఇక ముందు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నారు.

డాలర్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలను డాలర్ల మారకంలో నిర్ణయిస్తారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. డాలరు మారకం విలువ బలహీనపడితే బంగారం పెరుగుతుంది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక డాలర్ బలపడుతోంది.

కరెన్సీ అస్థిరత:
బంగారం ధర పెరగడంలో కరెన్సీ అస్థిరత కూడా ముఖ్య భూమికను పోషిస్తుంది. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ తగ్గుతున్నట్లైతే, బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. దీనిని బట్టి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు అంతర్జాతీయ బంగారం ధరలపై ఓ కన్నేసి ఉండటం మంచింది. దీనితో పాటు రూపాయి అస్థిరతను కూడా పరిశీలిస్తే మంచిది. ప్రస్తుతం బంగారం ఔన్సు ధర 1133 డాలర్లుగా ఉంది.

నగలు, ఆభరణాలు
మన దేశంలో భౌతిక రూపంలో బంగారం కొనుగోళ్లపై పరిమితులు లేవు. చేతిలో ఉన్న బంగారాన్ని ఎప్పుడైనా అమ్ముకొని నగదు రూపంలో మార్చుకోవచ్చు. అయితే కొనుగోలు విలువలో 20% వరకూ మేకింగ్ చార్జీలు ఉంటాయి. ఎక్కువ మొత్తంలో(పెట్టుబడి ఉద్దేశంతో) బంగారం కొంటే మూడేళ్ల తర్వాత దీర్ఘకాలిక మూలధన రాబడుల రూపంలో 20శాతం పన్ను ఉంటుంది. అయితే స్వచ్చత విషయంలో స్థానిక వ్యాపారుల వద్ద కొన్న బంగారానికి కచ్చితమైన హామీ ఇవ్వలేం.

గోల్డ్ మానిటైజేషన్
బంగారం పెట్టుబడుల ద్వారా సైతం వడ్డీ రూపంలో ఆదాయం వచ్చేందుకు భారత ప్రభుత్వం పసిడి నగదీకరణ(గోల్డ్ మానిటైజేషన్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చు. ఈ బంగారు నగలు,ఆభరణాలను కరిగించి బులియన్ రూపంలోకి మారుస్తారు. బంగారు ఒరిజినల్ డిపాజిట్ విలువ ఆధారంగా వడ్డీ ఆర్జిస్తారు. ప్రస్తుత విలువతో సంబంధం లేకుండా మీరు పెట్టుబడి పెట్టినప్పటి విలువ ఆధారంగా వడ్డీ వస్తుంది. అయితే మీ బంగారం పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలంటే మీకు చెల్లించే మొత్తం మార్కెట్ వాల్యూ ఆధారంగా చెల్లిస్తారు. దాంతో పాటు వడ్డీ అదనంగా చెల్లిస్తారు.

గోల్డ్ ఈటీఎఫ్‌లు
గోల్డ్ ఈటీఎఫ్ అనేది భౌతిక రూపంలో ఉన్న బంగారం ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఎక్స్చేంజీ. స్టాక్ ఎక్స్చేంజీలో షేర్లను ట్రేడ్ చేసినట్లే ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్లు ఓపెన్ ఎండెడ్ ఫండ్లు. ఒక్కో యూనిట్ కొన్నిషేర్లతో సమానంగా ఉంటుంది. రెగ్యులర్ షేర్ల మాదిరే గోల్డ్ ఈటీఎఫ్‌లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో కొనవచ్చు. ఇందుకోసం డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా అవసరం. కొంత కాలానికి నిర్ణీత మొత్తంలో బంగారాన్ని సొంత చేసుకునేందుకు ఈ ఈటీఎఫ్‌లు అవకాశం ఇస్తాయి.ఈ పెట్టుబడులకు ఫండ్ హౌస్‌లు కొంత మొత్తంలో అసెట్ మేనేజ్‌మెంట్ రుసుములను వసూలు చేస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్ డీమ్యాట్ ఖాతా, బ్రోకర్ ద్వారా జరుగుతుంది. ఇది చాలా సౌకర్యవంతమైన పద్దతి

గోల్డ్ సేవింగ్ ఫండ్స్
ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 నుంచి మొదలవుతుంది. గోల్డ్ సేవింగ్ ఫండ్స్‌ను ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌గా సైతం వ్యవహరిస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనూ, ఇతర స్వల్పకాలిక ఫండ్లలోనూ గోల్డ్ సేవింగ్ ఫండ్లు పెట్టుబడులు పెడతాయి. వీటిని ఎప్పుడైనా వెనక్కు తీసుకోవచ్చు. ఈటీఎఫ్‌ల్లో అంతర్గతంగా ఉండే 1 శాతం కచ్చితమైన రుసుములు కాకుండా అదనంగా 0.5% వరకూ ఖర్చులుంటాయి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications