ఆశ్చ‌ర్యం! రూ.999కే ఫోన్. విడుద‌ల‌కు జియో స‌న్నాహాలు

ఇప్ప‌టికే 4జీ సాంకేతిక‌త‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో సెన్సేషనల్ స్టేట్‌మెంట్‌తో ముందుకు రాబోతోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను కుదుపున‌కు గురి చేసే ప్రకటన త్వరలో వెలువడబోతోంది. సర్వీసుల్లో నాణ్యత

ఇప్ప‌టికే 4జీ సాంకేతిక‌త‌లో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో సెన్సేషనల్ స్టేట్‌మెంట్‌తో ముందుకు రాబోతోంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను కుదుపున‌కు గురి చేసే ప్రకటన త్వరలో వెలువడబోతోంది. సర్వీసుల్లో నాణ్యత సంగతి పక్కన పెడితే ఇప్పటికే జియోతో టెలికాం మార్కెట్లో హంగామా సృష్టించింది. ఇప్పుడు అత్యంత తక్కువ ధరతో 4జీపై పనిచేసే ఎల్‌టీఈ టెక్నాలజీతో పనిచేసే ఫోన్లను విడుద‌ల చేయ‌బోతోందని సమాచారం. రూ.999 నుంచి రూ.1500 మధ్య లాంఛ్ అయ్యే ఈ ఫోన్లను ముకేష్ అంబానీ త్వరలో ప్రకటించవచ్చని తెలుస్తోంది.

ఆశ్చ‌ర్యం! రూ.999కే ఫోన్. విడుద‌ల‌కు జియో స‌న్నాహాలు

మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌నే కుదిపేసే ఈ ప్ర‌క‌ట‌న‌ కోసం జనాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మాస్ మార్కెట్‌ను కైవసం చేసుకుని టెలికాం రంగాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని అంబానీ లెక్కలేస్తున్నారు. అందులో భాగంగానే అత్యంత చౌక ధరలో ఫోన్లను ఇవ్వాలనే ప్లాన్ వేశారు. తక్కువ రేట్లలో ఉన్న ఫీచర్ల ఫోన్ల స్థానంలో ఇలాంటి VoLTE ఫోన్లు వస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆశ్చ‌ర్యం! రూ.999కే ఫోన్. విడుద‌ల‌కు జియో స‌న్నాహాలు

జియో తీసుకురావాలని అనుకుంటున్న వోల్టే ఫీచర్ ఫోన్లలో ఫ్రంట్ ఫేసింగ్, రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు జియో చాట్, లైవ్ టీవీ, వీడియో ఆన్ డిమాండ్ వంటి ఫీచర్డ్ యాప్స్‌ను అందుబాటులో ఉంటాయ‌ని స‌మాచారం. డిజిటల్ వ్యాలెట్ సర్వీసు అయిన జియో మనీని కూడా ఈ కొత్త ఫోన్ల ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం క‌ల్పించుకోవాల‌ని జియో టీం వ్యూహాలు ర‌చిస్తోంది. ఒక వేళ అనుకున్న సమయానికి జియో వోల్టే ఫీచర్ ఫోన్లు మార్కెట్లోకి వస్తే.. స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తీవ్ర ప్ర‌మాదంలో పడినట్టే అనుకోవాలి. త్వరలో విడుద‌ల కాబోతున్న రూ.999 ఫోన్ల కోసం రిలయన్స్ జియో సంస్థ లావా మొబైల్స్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. లైఫ్ ఈజీ పేరుతో ఈ ఫీచర్ ఫోన్లు విడుదల కావొచ్చు. టచ్ స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్లు అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+