వడ్డీ రేట్లు తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పేద, దిగువ మధ్యతరగతివారికి రుణాల ఇవ్వడం వైపు దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన నేపథ్యంలో 24 గంటలల్లోపే బ్యాంకులు స్పందించాయి. ప్రాధాన్యత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్
పేద, దిగువ మధ్యతరగతివారికి రుణాల ఇవ్వడం వైపు దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన నేపథ్యంలో 24 గంటలల్లోపే బ్యాంకులు స్పందించాయి. ప్రాధాన్యత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ప్రామాణిక రుణ రేటును 0.9 శాతం తగ్గించింది. దీంతో వివిధ టర్మ్ రుణాల వడ్డీ రేట్లన్నీ కూడా ఆ మేరకు తగ్గనున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.7 శాతం మేర తగ్గించగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం 0.65 శాతం నుంచి 0.9 శాతం దాకా తగ్గించింది. రాబోయే రోజుల్లో మిగతా బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కన్పిస్తున్నాయి. నిధుల వ్యయం ఆధారంగా నిర్ణయించే ఈ కొత్త వడ్డీ రేట్లు(ఎంసీఎల్‌ఆర్) జనవరి 1నుంచి అమలులోకి వస్తాయని స్టేట్ బ్యాంక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం ఏడాది కాలావధి కల రుణాలపై వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు లక్షల కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ చర్య తీసుకుంది. అలాగే రెండేళ్ల కాలావధి కలిగిన రుణాలకు వడ్డీ రేటు 8.10 శాతంగా, మూడేళ్ల కాలావధి రుణాలకు 8.15 శాతంగా ఉంటుందని కూడా ఎస్‌బిఐ ఆ ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications
