తుది గడువు డిసెంబర్ 30తో ముగియనుంది. ఆ తరువాత ఈ నోట్లు ఏ మాత్రం చెల్లుబాటు కావని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. డిసెంబరు 30 తర్వాత ఎవరి వద్దైనా రూ.500, రూ.1000 పాత నోట్లు ఎక్కువగా ఉంటే జరిమానా
ఇప్పటికే నగదు కొరతతో సతమతమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రద్దైన పెద్ద నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే తుది గడువు డిసెంబర్ 30తో ముగియనుంది. ఆ తరువాత ఈ నోట్లు ఏ మాత్రం చెల్లుబాటు కావని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. డిసెంబరు 30 తర్వాత ఎవరి వద్దైనా రూ.500, రూ.1000 పాత నోట్లు ఎక్కువగా ఉంటే జరిమానా విధించనున్నారు. పాతవన్నీ కలిపి పెద్ద నోట్ల విలువ రూ. 10 వేలకు మించకూడదు. మించితే జరిమానా విధిస్తారు. ఈ విధంగా ప్రతిపాదించినట్లు సమాచారం.
రద్దైన పాత పెద్ద నోట్లు డిసెంబర్ 30 తర్వాత పది వేలకుపైగా కలిగి ఉన్నా, ఎవరికైనా ఇచ్చినా, తీసుకున్నా చట్టరీత్యా నేరం. దీనిపై రూ.50,000 జరిమానా లేదా ఎంత డబ్బులుంటే దానికి ఐదు రెట్ల జరిమానా విధించే అవకాశముంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 30లోగా కేంద్రం దీనిపై ఓ ఆర్డినెన్స్ జారీ చేయవచ్చని సమాచారం. రద్దయిన నోట్లను మార్చి,31 వరకూ మార్చుకోవడానికి అవకాశమున్నా ఆ గడువును తగ్గిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications
