95 కోట్ల మంది ఇంటర్నెట్ అనుసంధానతకు దూరంగా ఉన్నారా?
ఒక పక్క డిజిటల్ ఇండియా అని ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ ఇంటర్నెట్ అనుసంధానతలో దేశ వెనుకబాటు తనం మరోసారి బయటపడింది. ఇప్పటికే ప్రపంచంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో రెండో అతిపెద్ద దేశం
ఒక పక్క డిజిటల్ ఇండియా అని ప్రభుత్వం ఊదరగొడుతున్నప్పటికీ ఇంటర్నెట్ అనుసంధానతలో దేశ వెనుకబాటు తనం మరోసారి బయటపడింది. ఇప్పటికే ప్రపంచంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ కొనసాగుతోంది. అయిన్పటికీ దేశంలో 95 కోట్ల మందికి ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని అసోచామ్-డెలాయిట్ సంయుక్త నివేదిక పేర్కొంది. దేశంలో ఇంటర్నెట్ డేటా ప్లాన్ ధరలు ప్రపంచ దేశాల కన్నా తక్కువగా ఉన్నాయని, స్మార్ట్‌ఫోన్స్ కూడా తక్కువ ధరలకు లభ్యమౌతున్నాయని అయినా కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఇంకా చాలా మందికి అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యకరమని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 35 కోట్లుగా ఉందని, చైనా తర్వాతి రెండో స్థానంలో కొనసాగుతోందని పేర్కొంది.
"స్థానిక అవసరాలకు అనుగుణంగా స్టార్టప్‌లు యాప్‌లు తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రయివేటు రంగంలో నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల ద్వారా ఆయా సంస్థలు ఉత్సాహంగా పాల్గొనేందుకు ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాల్సి ఉంది. తద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అంతే కాకుండా స్థానిక భాషల్లో సాంకేతికత, సమచారంను వృద్ది చెందించడం ద్వారా డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలి" అని నివేదిక సూచించింది. అంతే కాకుండా భవిష్యత్తులో డేటా భద్రత, సైబర్ నేరాలపై ఆందోళనలను వెలిబుచ్చింది. దేశం డిజిటల్ దిశగా సాగే ముందు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.


Click it and Unblock the Notifications
