ఎన్‌పీఎస్ చందాదారులు ఆన్‌లైన్ మోడ్ కోసం ఈఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారానే చేసే వీలుంది. ప్రస్తుతం సెంట్రల్ రికార్డింగ్ ఏజెన్సీలో ఐపిన్ వివరాలను ఉపయోగించి సైతం చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని ప్రవేశపెట
ఎన్‌పీఎస్ చందాదారులు ఆన్‌లైన్ మోడ్ కోసం ఈఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారానే చేసే వీలుంది. ప్రస్తుతం సెంట్రల్ రికార్డింగ్ ఏజెన్సీలో ఐపిన్ వివరాలను ఉపయోగించి సైతం చెల్లింపులు చేసే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టారు. ఎన్‌పీఎస్ ఖాతాను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏ లబ్దిదారుడైనా ఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడంతో పాటు చెల్లింపులనూ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చు. దీని ద్వారా సమయం ఆదా అవడంతో పాటు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన శ్రమ తగ్గుతుంది.
ఎన్‌పీఎస్ చందాదారులంతా సెంట్రల్ రికార్డ్ కీపీంగ్ ఏజెన్సీ వద్ద టైర్-1 ఖాతా తెరవాలి. వీటన్నింటికి ప్రత్యేక శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్య(ప్రాన్)ను కేటాయిస్తారు. దీనిని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సైతం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.
ఈ-ఎన్‌పీఎస్ ఖాతా లాగిన్ లింక్

ఆధార్ ఓటీపీ
ఎన్‌పీఎస్ ఖాతా ఆన్‌లైన్‌లో తెరిచేందుకు ఆధార్ సంఖ్య తప్పనిసరి. ఈ-ఎన్‌పీఎస్ లింక్ తెరవగానే ప్రారంభ పేజీలోనే నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబరును ఎంటర్ చేయాలి. ఆధార్ నంబరును సబ్‌మిట్ చేసిన తర్వాత మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఆన్‌లైణ్ ఫారంలో పూరించాలి.
ఆన్‌లైన్ ఖాతా తెరిచేందుకు
పాన్, బ్యాంకు ఖాతా, మొబైల్ సంఖ్య, ఈమెయిల్ ఐడీ కలిగి ఉండాలి.
ఎన్‌పీఎస్ నమోదు సమయంలో అక్కడ ఉన్న కేవైసీని బ్యాంకు సరిచూసి ఉండాలి.
ఫోటో, సంతకం స్కాన్ చేసి ఉండాలి.
పేమెంట్ గేట్‌వేలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎన్‌పీఎస్ చెల్లింపులు చేయవచ్చు.
ఈ వివరాలన్నీ ఉంటే https://enps.nsdl.com/eNPS/LandingPage.html నందు నింపాలి.
మొత్తం ఖాతా తెరిచే ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసి సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ( సీఆర్ఏ)కి పంపాలి. మొదటిసారి చెల్లింపు జరిపిన తర్వాత, శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్య(ప్రాన్)ను కేటాయిస్తారు. దీంతో ఆన్‌లైన్ ఖాతా తెరిచినట్లవుతుంది.
ఆన్‌లైన్‌లో నమోదు చేసిన చిరునామాకు ప్రాన్ కిట్‌ను పంపుతారు.
ప్రాన్ కిట్‌లో ప్రాన్ కార్డ్, ఐపిన్ /టీ పిన్ తో పాటు పథకానికి సంబంధించిన సమాచారం ఉంటుంది.
అన్నీ వివరాలు నింపడం పూర్తయిన తర్వాత సీఆర్ఏకు పంపాలి.
చిరునామా:
NSDL e-Governance Infrastructure Limited,
1st Floor, Times Tower,
Kamala Mills Compound, Senapati Bapat Marg,
Lower Parel, Mumbai - 400 013
దీనికి సంబంధించిన ఎటువంటి అనుమానాలనైనా నివృత్తి చేసుకునేందుకు
ఫోన్ నంబరు: 022 - 4090 4242, మెయిల్ ఐడీ: [email protected]
ఇది కూడా చదవండి ఎన్‌పీఎస్ చందాదారులకు వెబ్‌సైట్‌లో జతయిన 7 కొత్త ఫీచర్లు

ఖాతా తెరిచే ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి చెల్లింపుల ప్రక్రియ:-
ఆన్‌లైన్‌లో కంట్రిబ్యూట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
మొదటిసారి కనీస చెల్లింపు రూ. 500 లేదా అంతకంటే ఎక్కువ చేయాలి.
టైర్1, టైర్2 ఖాతా కలిగిన వారు ఈఎన్‌పీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే తదుపరి చెల్లింపులను చేయవచ్చు.
ఆన్‌లైన్ చెల్లింపులు చేసేందుకు కింది వారు మాత్రమే అర్హులు
* టైర్1 లేదా టైర్ 2 ఖాతా ఉండాలి.
* నమోదిత మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీపీ ద్వారా ప్రాన్‌ను ధ్రువీకరించాలి.
* చెల్లింపులను డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే వీలుంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications