సామాజిక భద్రతలో భాగంగా అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం న్యూ పెన్షన్ స్కీం (ఎన్‌పీఎస్)ను ప్రవేశపెట్టింది. పీఎఫ్ఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉన్న ఈ పథకానికి మొబైల్ యాప్ సహా కొత్త సదుపాయాలను నియంత్రణ సంస్థ ప్రవేశపెట్టింది.ఎన్‌పీఎస్‌లో రిటైర్మెంట్ సంవత్సరాన్ని 60గా నిర్ణయించారు. 18 నుంచి 55 సంవత్సరాల లోపు వారు ఈ పథకంలో చేరవచ్చు. దీని పనితీరు మ్యూచువల్ ఫండ్ పథకాల మాదిరిగానే ఉంటుంది. మన నుంచి సమీకరించిన మొత్తాన్ని ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్‌పీఎస్ రాబడులను అందిస్తుంది. ఎన్‌పీఎస్ ఫండ్స్‌ను ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యూటీఐ, రిలయన్స్, ఐడీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రాలు నిర్వహిస్తున్నాయి.
ఎన్‌పీఎస్‌కు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లను ఇక్కడ చూద్దాం.

మొబైల్ అప్లికేషన్
ఏదైనా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చందా వివరాలను తెలుసుకోవాలంటే ఎన్‌పీఎస్ చందాదారుడు మొదట అభ్యర్థన చేయాలి. నమోదయిన మెయిల్ ఐడీకి సమాచారం అందుతుంది. పథకానికి సంబంధించిన తాజా ఎన్ఏవీ(నెట్ అసెట్ వాల్యూ) , చివరి ఐదు క్రెడిట్ సమాచారాలు, కాంటాక్ట్ వివరాల(మొబైల్ నంబరు, మెయిల్ ఐడీ)ను మార్చుకోవడం, పాస్ వర్డ్ మార్పు వంటివి మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

ఆధార్ అథెంటికేషన్ ద్వారా చిరునామా మార్పు
ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ద్వారా ఎన్‌పీఎస్ చందాదారులు చిరునామా మార్పును చేసుకోవచ్చు.
ఆధార్ వ్యవస్థలో ఉన్న చిరునామా, మొబైల్ లేదా మెయిల్‌కు వచ్చే ఓటీపీ వివరాలను సమర్పించడం ద్వారా చిరునామా మార్పు పూర్తవుతుంది. నియంత్రణ సంస్థ సెంట్రల్ రికార్డింగ్ ఏజెన్సీ నుంచి వివరాలను సేకరిస్తుంది.

స్కీమ్ ప్రాధాన్యత మార్పు సౌకర్యం
ఆన్‌లైన్‌లో లాగిన్ అయిన తర్వాత చందాదారుడు స్కీమ్ మార్పు చేసుకునేందుకు సైతం వీలుంటుంది. ఇందుకోసం మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అథెంటిఫికేషన్ పూర్తయిన తర్వాత పీఎఫ్ఎమ్, అసెట్ క్లాస్, అల్లొకేషన్ రేషియో, స్కీమ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు.

ఈఎన్‌పీఎస్ ద్వారా యాక్టివేషన్
టైర్1 ఎన్‌పీఎస్ ఖాతా కలిగిన ఎవరైనా టైర్2 ఖాతాను ఆన్‌లైన్‌లో తెరవొచ్చు. ఇందుకోసం ప్రాన్, పుట్టిన తేదీ, పాన్ సంఖ్యలను ఎంటర్ చేసి ఈఎన్‌పీఎస్ ద్వారా టైర్2 ఖాతాను తెరిచే వీలుంది.

కేవైసీ రీ-వెరిఫికేషన్
ఇదివరకూ కేవైసీ వెరిఫికేషన్ పూర్తికాని వారికి, నిర్దారణ కాని వారికి, తిరస్కరణ అయిన వారికి ఇదో మంచి అవకాశం. చిరునామా, కేవైసీలను ఆధార్ ఆధారిత గుర్తింపు ద్వారా త్వరగా పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ఈఎన్‌పీఎస్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ డిటైల్స్ పైన క్లిక్ చేసి తదుపరి ప్రక్రియ పూర్తిచేయాలి.

ఆన్‌లైన్ కంట్రిబ్యూషన్
ఇంతకుముందు చందాదారులు ఆన్‌లైన్ మోడ్ కోసం ఈఎన్‌పీఎస్ పోర్టల్ ద్వారానే చేసే వీలుంది. ప్రస్తుతం సెంట్రల్ రికార్డింగ్ ఏజెన్సీలో ఐపిన్ వివరాలను ఉపయోగించి సైతం చేసే సౌకర్యం వచ్చింది.

టైర్ 2 ఖాతా నుంచి విత్‌డ్రా
వెబ్‌సైట్‌లో లాగిన్ అయి, ఓటీపీ ఉపయోగించి ఎన్‌పీఎస్ చందాదారులు టైర్2 ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇంతకుముందు ఎన్‌పీఎస్ టైర్ 2 విత్‌డ్రాయల్స్ కోసం పాయింట్స్ ఆఫ్ ఫ్రెజెన్స్ లేదా నోడల్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications