జియో దెబ్బకు బీఎస్ఎన్ఎల్ కూడా దిగొచ్చింది...
జియో దెబ్బకు దేశ టెలికాం రంగంలో మిగతా కంపెనీలు తమ టారిఫ్ రేట్లను భారీగా తగ్గించేస్తున్నాయి. జియో దెబ్బతో ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారులకు అందుబ
జియో దెబ్బకు దేశ టెలికాం రంగంలో మిగతా కంపెనీలు తమ టారిఫ్ రేట్లను భారీగా తగ్గించేస్తున్నాయి. జియో దెబ్బతో ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. వీటి బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇది కూడా చదవండి బంగారంపై పెట్టుబడులు పెట్టినట్లయితే ఇవి తెలుసుకోండి

ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త టారిఫ్ ప్లాన్‌లో భాగంగా కేవలం రూ.99తో రీ ఛార్జ్ చేసుకుంటే నెల రోజుల పాటు లోకల్ కాల్స్ , బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చు. ఇక ఈ ఆఫర్‌లోనే 300 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తారు. బీఎస్ఎన్ఎల్ ఇదివరకే 30 రోజుల కాలపరిమితితో రూ. 1099కి అపరిమిత 3జీ డేటాను అందిస్తోంది.
99 రూపాయల ఆఫర్ కోల్‌కత టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది.
మరో ఆఫర్‌లో రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్ వర్క్ కైనా చేసుకునేలా అవకాశం కల్పించడంతో పాటు 1జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది.


Click it and Unblock the Notifications