ప్రకటనల ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించినందుకు యోగా గురువు రాందేవ్‌బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు భారీ ఫైన్ వేసింది కోర్టు. ప్రకటనల్లో భారీగా వివరణలిచ్చి, ఉత్పత్తులు ఆ మేరకు నాణ
ప్రకటనల ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టించినందుకు యోగా గురువు రాందేవ్‌బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థకు భారీ ఫైన్ వేసింది కోర్టు. డిసెంబర్ 1న తీర్పు వెల్లడికాగా, ఆలస్యంగా ఇప్పుడు వెలుగుచూసింది. ప్రకటనల్లో భారీగా వివరణలిచ్చి, ఉత్పత్తులు ఆ మేరకు నాణ్యత లేవని తేలడంతో న్యాయస్థానం రూ.11 లక్షల జరిమానా వేసింది. అంతేకాదు నెల రోజుల్లో ఈ మొత్తాన్ని కట్టాలని, భవిష్యత్తులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది కూడా చదవండి కొత్త సంవత్సరంలో కాసులు కురిపించే ఉద్యోగాలివే....

నాణ్యతలేని ఉత్పత్తులను తప్పుడు ప్రకటనలతో వినియోగదారులను మభ్యపెట్టి మార్కెట్లో అధిక లాభాలను గడిస్తోందని 2012 లో హరిద్వార్ జిల్లా కోర్టులో కేసు నమోదైంది. దీనిపై ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చేపట్టిన పరీక్షల్లో పతంజలి వస్తువులు విఫలమయ్యాయి. తేనే, ఉప్పు, జామ్, మస్టర్డ్ ఆయిల్ ఉత్పత్తుల శాంపిల్స్ ను ఆ ఏడాది నవంబర్ లో సేకరించారు. అభియోగాలు నిరూపణ కావడంతో జరిమానా చెల్లించాలని హరిద్వార్‌లోని జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దశాబ్దాలుగా మార్కెట్లో పాతుకుపోయిన ఎఫ్ఎంసీజీ కంపెనీల పోటీని ఎదుర్కొని పతంజలి అనతి కాలంలోనే ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. అబద్ద ప్రచారాలు చేస్తూ ఈ ఎదుగుదలను సాధించిందని కోర్టులో వేసిన అభియోగాల నేపథ్యంలో ఈ సంస్థకు కోర్టు జరిమానా విధించింది. ఇతర సంస్థల ఉత్పాదనలను తమ బ్రాండ్ పేరిట ప్రకటనల్లో పేర్కొని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని ఆహార నాణ్యతా ప్రమాణాల శాఖను కోర్టు ఆదేశించింది.


Click it and Unblock the Notifications