నోట్ల రద్దు మొదలై నెల రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను ప్రకటించారు.
నోట్ల రద్దు మొదలై నెల రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు పలు రాయితీలను ప్రకటించారు.

నగదు లావాదేవీల నిర్వహణలో ఖర్చును భరించడం కష్టం. అందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రూ.500, 1000 నోట్ల రద్దు తర్వాత 20 నుంచి 40 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు పెరిగాయని తెలిపారు. నగదు రహిత లావాదేవీల పెంపునకు 11 సూత్రాలు రూపొందించినట్లు చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులు ఈ-వ్యాలెట్లు, మొబైల్ వ్యాలెట్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 0.75శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. 10వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు 2 పీవోఎస్ యంత్రాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నగదును అన్ని ప్రాంతాలకు ఆర్‌బీఐ సరఫరా చేస్తోందని వెల్లడించారు. రూ. 2 వేల వరకూ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలకు సేవా పన్నును రద్దు చేశారు.
ఇది కూడా చదవండి ఆ 11నగరాల్లో గృహ వసతి గిరాకీ
సబర్బన్ రైళ్లలో నెల, ఏడాది సీజనల్ టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి రాయితీ ఇస్తామని, రైల్వేలో ఇప్పటి వరకు 58 శాతం మంది ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి రూ.10లక్షల బీమా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఆన్‌లైన్ చెల్లింపులతో రైల్వే క్యాటరింగ్, వసతి సౌకర్యం కోసం బుక్ చేస్తే 5శాతం, ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తే రాయితీలు కల్పిస్తామని తెలిపారు. ఇది సాధారణ బీమాకు 10 శాతం, జీవిత బీమాకు 8 శాతంగా ఉంటుందని అన్నారు. జనవరి 1 నుంచి ముంబయి సబర్బన్ రైళ్లలో రాయితీ విధానం అమల్లోకి వస్తుందనిజైట్లీ పేర్కొన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications